Soft Drinks: నిత్యం కూల్‌డ్రింక్స్‌ తాతున్నారా. జాగ్రత్త..

Soft Drinks: ప్రస్తుత కాలంలో నీళ్ల కన్నా కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారు. ఏ సీజన్‌ అయినా సరే.. అవి తాగకుండా ఉండలేకపోతున్నారు. కొందరు వింధుల్లోనూ కూల్‌డ్రింక్స్‌లను అందుబాటులో ఉంచుఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి.. కూల్‌డ్రింక్స్‌ తాగేవారి సంఖ్య ఎలా ఉందో. చాలా మంది బిర్యానీలు, జంక్‌ఫుడ్‌ తిన్న తర్వాత కచ్చితంగా డ్రింక్స్‌ తాగుతుంటారు.ఇంకొందరు కోకాకోలానే ఇష్టంగా తగుతుంటారు. ఇది అరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందట. ప్రతిరోజూ కోకాకోలా ఆధారిత శీతలపానీయాలు తాగేవారు అధిక బరువు, మధుమేహం, తదితర వ్యాధుల బారిన పడుతున్నారని ఓ అధ్యాయనం ద్వారా వెల్లడైంది. కోకాకోలా తాగేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం సైతం తగ్గిపోతుందనే ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఈ అంశంపై బ్రెజిల్‌లో శాంటా కాటరినా విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించారు. ఎలుకలపై నీరు ప్రయోగం నిర్వహించారు. వాటిని రెండు బృందాలుగా డివైడ్‌చేసి ఒక సమూహానికి నీరు, మరో సమూహానికి కోక్, నీరు అందించారు. కోక్‌ తాగిన సమూహం పేలవమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉందని గుర్తించారు. అభిజ్ఞా పనితీరుతోపాటు కోలా తాగిన ఎలుకల సమూహం ఆక్సీకరణ ఒత్తిడిని కలిగి ఉందని కనుగొన్నారు.

శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్‌ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. టాక్సిన్స్‌ సరిగ్గా బయటకు వెళ్లకపోతే అది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. చిన్నపిల్లలకు శీతలపానీయాలు తాగే అలవాటు ఉంటే వెంటనే వారిని మాన్పించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా శీతల పానీయం తాగుతుండటంతో జ్ఞాపకశక్తి లోపం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -