YS Jagan: మాయ చేయాలని అనుకున్న జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. ఆ ఐపీఎస్ లకు సైతం చెక్ పెట్టారుగా!

YS Jagan: నిన్న, మొన్నటి వరకు చూసి చూడనట్టు విదేసింది అనిపించుకున్న ఈసీ ఏపీలో చర్యలు మొదలు పెట్టింది. రాజకీయ పార్టీల అడుగులకు మడుగులు వదులుతున్న అధికారులపై బదిలీ వేటు వేస్తుంది. ఇప్పటికే వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించిన ఈసీ ఇప్పుడు సివిల్ సర్వీస్ అధికారులపై కూడా కొరడా ఝుళిపించింది. ఏపీలో ఆరుగురు IPS, ముగ్గురు IASలపై ఈసీ బదిలి వేటు వేసింది. అధికారులు జగన్‌కు అనుకూలంగా నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా ఈసీకి వివరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందువల్లే రాష్ట్రంలో ఒకేసారి 9 మంది అధికారులపై బదిలీవేటు పడింది. అంతేకాదు.. వారిని మళ్లీ ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపించాలని ఆదేశించింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈసీ ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో.

ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం, అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ కొరడా ఝుళిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసీ నియమించిన స్పెషల్ అబ్జర్వర్ రాష్ట్రానికి వచ్చిన వెంటనే చర్యలకు తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ముఖ్యంగా చిలుకలూరిపేటలో నిర్వహించిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలను ఈసీ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా వైఫల్యాలు, ట్రాఫిక్ ను నిలువరించలేకపోవడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు గుర్తించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగటాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. వీరితోనే సరిపెట్టకుండా.. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై కూడా ఈసీ వేటు వేసింది. ఓటర్ల జాబితాలో వీరంతా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయి. మరోవైపు.. ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపైనా ఈసీ వేటు వేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు పంపాలని ఆదేశించింది.

ఓ రకంగా చెప్పాలంటే.. టీడీపీ ఇలాంటి చర్యల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈసీ ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఉండాలనే జగన్ కూడా పొత్తు కుదరకుండా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీ.. వైసీపీకి సహకరించడంతో చాలా ప్రాంతాల్లో అధిరులను అనుకూలంగా వాడుకుంది. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కావాల్సిన ప్రాంతాల్లో కావాల్సిన అధికారులను జగన్ నియమించుకున్నారు. వారి సాయంతో ఎలాగైనా అధికారంలోకి రావొచ్చని ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ, మొదటికే మోసం జరిగినట్టు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ముద్రపడినవారిని ఈసీ తీసి ఎలక్షన్స్ తో సంబంధం లేని చోట పడేసింది.

మొత్తంగా జగన్ కు ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలుగానే పరిగణించాలి. అందుకే ఇప్పటికే డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం జగన్ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. ఇలా ఫించన్ల పంపిణీ ఎపిసోడ్, అధికారుల బదిలీ అంశాలు జగన్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిన మాట వాస్తవం. మరోవైపు చెల్లెల్లు షర్మిల, సునీతారెడ్డి నుంచి జగన్ ను ముప్పు తప్పేలా లేదు. కూటమి నుంచి పోటీని తట్టుకుంటూనే.. ఇంటిపోరులో గెలవాల్సిన టాస్క్ ఇప్పుడు జగన్ ముందుంది. మరి జగన్ వీరందరినీ ఎలా ఎదుర్కొంటురో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -