YCP: అన్ని పార్టీలు కలిసినా వైసీపీదే విజయమా.. లెక్క తప్పదంటూ?

YCP: 2024 ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టీడీపీకి కీలకం కానున్నాయి. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా టీడీపీ మాత్రం జనసేన, ఇతర పార్టీల సహాయసహకారాలతో ఎన్నికల బరిలో దిగుతోంది. 2009 నాటి ఎన్నికల పరిస్థితులు 2024 సంవత్సరంలో సైతం రిపీట్ అవుతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ని పార్టీలు కలిసినా వైసీపీదే విజయమని సర్వేలు చెబుతున్నాయి.

 

సీఎం జగన్ పార్టీకి పోటీగా ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని భావించి ప్రత్యర్థులు అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ హీరో అని ఇతర పార్టీలు విలన్లు అని పొత్తుల ద్వారా ఇతర పార్టీల నేతలు చెప్పకనే చెబుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

2009 సంవత్సరంలో టీడీపీ, టీ.ఆర్.ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడినా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 157 స్థానాలు వచ్చాయంటే వైఎస్సార్ పై ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగానే అర్థమవుతుంది. జగన్ సైతం అదే హిస్టరీని రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. జగన్ మాత్రం పొత్తు అవసరం లేదని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమదే విజయం అని టీడీపీ ఎంత ప్రచారం చేసుకున్నా ఫలితం మాత్రం ఊహకు అందని విధంగా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -