Dastagiri: కుట్రలో భాగంగానే అన్నీ జరిగాయి.. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు!

Dastagiri: వివేకా హత్యకేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఈ కేసులో సంచలన విషయాలు విలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వివేక హత్య కేసులో మొన్నటి వరకు అవినాష్ రెడ్డి పేరు కీలకంగా వినిపించిన విషయం తెలిసిందే. కానీ గత కొద్ది రోజులుగా వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కాగా వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనకు లాయర్ ను పెట్టుకునే స్థోమత లేదని అందుకే న్యాయ సహాయం చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ చనిపోయినంత వరకూ వివేకా పీఏగా ఉన్న ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్ధిక స్థోమత తనకు లేనందున న్యాయవాదిని కల్పించాలని దస్తగిరి సుప్రీంకోర్టును కోరాడు. దీనిపై సోమవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ తో పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. వివేకాను చనిపోయిన తర్వాత మొదటగా చూసింది కృష్ణారెడ్డినే. దారుణ హత్యకు గురైనా ఆ విషయాన్ని చెప్పలేదు.

 

దీంతో ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీబీఐ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాశ్‌ను అనుమానితులుగా చేర్చారు. హత్యకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి డబ్బులిస్తారని సాక్ష్యాలేవీ లేకుండా చూసుకుంటారని మనకు భయం లేదని గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్లు దస్తగిరి తన అప్రూవర్‌ స్టేట్‌మెంట్‌లో తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది. డబ్బు ఇవ్వడంతో పాటు హత్య తర్వాత కేసు పెట్టకుండా ప్రయత్నాలు చేయడం, రక్తాన్ని కడిగేయడం, గాయాలు కనిపించకుండా బ్యాండేజీలు వేసి పూలతో అలంకరించడం వంటివన్నీ కుట్రలో భాగంగానే జరిగాయని తెలిపింది. నిందితుల పాత్రను నిరూపించేలా కాల్‌ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, గూగుల్‌ టేకౌట్‌, వివేకా ఇంటిలోని వైఫైకి సంబంధించిన సమాచారం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు, నిపుణుల అభిప్రాయాలు సహా భారీ డేటాను సమీకరించినట్లు వెల్లడించింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -