Viveka Murder Case: వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి తండ్రిపై వైసీపీ దాడి.. మరీ దారుణమంటూ?

Viveka Murder Case: మాజీ మంత్రి దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇటీవల రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జై భీమ్ భారత పార్టీలోకి చేరారు. ఈ పార్టీలోకి చేరినటువంటి ఈయన ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్ వివేక హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈయన మాటల ద్వారా ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాశ్ హస్తం ఉందని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ధూమారం రేపాయి. అయితే వైఎస్ఆర్సిపి నాయకులు దస్తగిరి తండ్రిపై దారుణంగా దాడి చేశారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాల గుండు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

దస్తగిరి తండ్రి శివరాత్రి జాగరణ కోసం వెళ్తుండగా ఆయనని వైకాపా నేతలు అడ్డుకున్నారు పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై పోటీ చేసే అంత దమ్ము దస్తగిరికి ఉందా అంటూ హజీవలీ పై దాడికి దిగారు. ఈ దాడిలో భాగంగా ఈయన తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఈ విధంగా గాయాలు పాలైనటువంటి ఈయనని పులివెందులలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఈ విధంగా తన తండ్రి పట్ల వైకాపా నాయకులు దాడి చేయటం పట్ల దస్తగిరి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసిపి పార్టీకి వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈయన మీడియా సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటి ఘటనకు దారి తీసాయని, ఇలా దస్తగిరి తండ్రి పై దాడి చేయడం దారుణం అంటూ పలువురు ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -