Manoj-Mounika: మంచు మనోజ్ భూమా మౌనికల రిలేషన్ ఇప్పటిది కాదు.. అసలైన నిజాలు బయటపెట్టిన ఆ వ్యక్తి!

Manoj-Mounika: టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలపరంగా స్క్రీన్ కు దూరంగా ఉంటున్నాడు. మరి దీనికి కారణం ఏంటో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మనోజ్ గురించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే మంచు మనోజ్, భూమా మౌనికలు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీళ్లు హైదరాబాదులోని ఒక గణేష్ మండపంలో కలిసి పూజలు చేశారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు చూసి ఒక విషయం చెప్తా అనడంతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లుగా అయ్యింది. ఇక ఈ విషయం గురించి ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు.. మంచు ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. ఇక భూమా మౌనికకు మొదటి పెళ్లి కాకముందే మనోజ్ తో రిలేషన్ లో ఉంది అని తెలిపాడు. ఇక ఇదేం తప్పు కాదు.. దేవతల కాలం నుంచి ఇలా చేస్తూనే ఉన్నారు. ప్రేమలో ఉండి విడిపోవడం.. వేరే వాళ్ళని చేసుకోవడం ఇవన్నీ కామన్ అని తెలిపాడు.

ఇక మనోజ్, భూమా మౌనికల మధ్య ఎప్పటినుంచో రిలేషన్ ఉంది. కొన్ని సందర్భాల్లో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ మౌనిక వాళ్ల తండ్రి భూమా నాగిరెడ్డి ఈ పెళ్లికి అంగీకరించలేదట. ఆ తర్వాత మౌనికకు వేరే పెళ్లి చేశారట. ఒక కొడుకు పుట్టి విడాకులు తీసుకున్న తర్వాత మౌనిక మనోజ్ తో సహజీవనం చేస్తుందని ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు తెలిపాడు. మరి ఈ విషయం గురించి మంచు మనోజ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -