Free Bus Fake: ఏపీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఉత్తిదే.. మాటలు ఒకలా చేతలు మరోలా అంటూ?

Free Bus Fake: ఏపీ సీఎం జగన్ మాటలు కోటలు దాటినా.. చేతలు గడపలు దాటడం లేదు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తామని.. పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని సీఎం జగన్ తరచూ చెబుతూ ఉంటారు. అయితే.. ఆయన మాటలకు, చేతలకు అసలు పొంతన లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెన్త్ విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ కు వెళ్లడానికి.. మళ్లీ తిరిగి రావడానికి బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇదే సాంప్రదాయం నడుస్తోంది. అయితే, గతేడాది నుంచి ఈ సాంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం నెమ్మదిగా శుభం కార్డు వేస్తూ వస్తుంది.

ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని పరీక్షలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. పైసా ఖర్చు లేకుండా విద్యార్థులు పరీక్షలకు వెళ్లొచ్చని తెలిపింది. అయితే, విశాఖ మన్యం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం ప్రకటించింది కదా.. అని బస్సెక్కితే విద్యార్థులకు చుక్కలు కనిపించినట్టే. హాల్ టికెట్లు చూపిస్తే.. పీటీడీ బస్సుల్లో స్టూడెంట్స్ ఉచిత ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి గిరిజన విద్యార్థులు భంగపడ్డారు. కేవలం అటుగా వెళ్తున్న బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు. కానీ.. ఆశ్రమ పాఠశాల నుంచి ఎగ్జామ్స్ కు వెళ్లాలి అంటే మాత్రం విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిందేనని కండక్టర్లు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక స్టూడెంట్స్ డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులు స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసే బాధ్యత టీచర్లు తీసుకుంటున్నారు. టీచర్లు ఆ డబ్బును పీటీడీ అధికారులకు ఇస్తున్నారు. అయితే.. కండక్టర్ ఉద్యోగాలు మాకెందుకని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. మన్యం జిల్లా కేంద్రం పాడేరులో ఐదు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దీని కోసం 11 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దీంతో ఒక్కో స్టూడెంట్ కు 10 నుంచి 20 రూపాయలు చెల్లిస్తున్నారు.

అంతేకాదు.. పిల్లల దగ్గర డబ్బులు లేకపోతే వారి ఛార్జీలు హెడ్ మాస్టర్లు లేదా వార్డెన్లు చెల్లించాల్సి వస్తుంది. డబ్బులు లేని విద్యార్థులను ఆటోలో తరలిస్తామని చెబితే పీటీడీ అధికారులు.. టీచర్లకు మెమోలు జారీ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక సొంత సొమ్ముతోనైనా విద్యార్థులను బస్సుల్లోనే పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నారు. గతంలో స్టూడెంట్స్ రవాణా ఖర్చులు ప్రభుత్వమే చూసుకునేది. కానీ, గతేడాది నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు విడుదల చేయడం లేదు. దీంతో.. ఐటీడీ అధికారులు విద్యార్థుల నుంచే డబ్బులు చెల్లిస్తున్నారు. గతేడాది హెడ్ మాస్టర్లు , వార్డెన్‌లే బస్సులకు అయ్యే ఖర్చులు భరించారు. కానీ.. ఈ ఏడాది వారు చేతులెత్తేయడంతో స్టూడెంట్స్ నుంచే ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -