KTR: సొంత ఇలాఖాలో మంత్రి కేటీఆర్‌కు షాక్.. సిరిసిల్లలో ఫ్లెక్సీల కలకలం

KTR: ఇటీవల ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ఫ్లెక్సీలను ఓ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యర్ధికంగా వ్యతిరేకంగా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు ఫ్లెక్సీలతో హీట్ పుట్టిస్తోన్నారు. ఆయనకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోన్నారు. ఈ ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్నారు. ఒకప్పుడుపార్టీల అభ్యర్థులు తమ గురించి ప్రచారం చేసుకోవడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యర్ధి అబ్యర్ధికి వ్యతరేకంగా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయడం కొత్త ట్రెండ్ గా మారింది.

అయితే మునుగోడు ఉపఎన్నికల క్రమంలో మంత్రి కేటీఆర్ నియోకవర్గమైన సిరిసిల్లలో ఫ్లెక్సీల కలకలం రేగింది. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక మంత్రి హరీష్ రావు కూడా చౌటుప్పల్ మండలాన్ని దత్తత తీసుకుంటానంటూ ప్రచారంలో ప్రకటించండం ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించుకోవడం సీఎం కపేసీఆర్ కు కీలకంగా మారింది. అందుకే మంత్రి కేటీఆర్, హరీష్ రావులను రంగంలోకి దింపారు. ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు ఇస్తున్న హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు దుమారం రేపుతోన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 2018 సెప్టెంబర్ 22రోజున ఎన్నికలకుముందు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ గారు యాదిమరిచిండ్రా సారు.. కేటీఆర్ నిర్వాకం వల్ల రోడ్డున పడ్డ ఎల్లారెడ్డిపేట మండల ఇంటర్ విద్యార్ధులు.. ప్రైవేట్ డిగ్రీ కాలేజీ నుంచి వచ్చే సంపాదన కోసం కేటీఆర్, అనుచరుల స్వలాభం కోసం వేల మంది విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తున్నారు. కేటీఆర్ గారు మీ కుటుంబం చదువుకున్నట్లు మా పేద విద్యార్ధులు చదువుకోవదవ్దా.. బంగారు తెలంగాణ అంటే విద్యార్ధుని చదువుకు దూరం చేయడమేనా మీ ఆలోచన.. విద్యార్ధుల ద్రోహి కేటీఆర్, మాకొద్దు ఈ పాలన అంటూ అంటూ ఎల్లారెడ్డి పేట విద్యార్థుల పేరిట సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.

సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన హామీని కేటీఆర్ నేరవేర్చలేదని, మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటూ కేటీఆర్ ఇచ్చిన హామీని నమ్మకండి అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద బీజేపీ మండలాధ్యక్షులు కార్తీక్ రెడ్డి, ఎబీవీపీ రంజిత్ రెడ్డిలు కేటీఆర్ కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ర్యాలీ చేస్తున్నారు. కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోన్నారు. రోజుకో హాస్టల్ లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇక ముస్తాబాద్ మండలల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామంటూ కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లు కేటీఆర్ నమ్మవద్దంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -