Romance: సెక్స్‌లో గుండెపోటు రాకూడదంటే ఇలా చేయండి!

Romance: శృంగారం అంటే అందరికీ ఇష్టమే. భార్య భర్తలను ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం, భద్రత కల్పించే అంశాల్లో సెక్స్‌ ప్రధానమైంది. అందుకే శృంగారాన్ని బంగారం అంటుంటారు. అంతగా ఆనందాన్నిచ్చే సెక్స్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తినా మనం అనుకున్న అనుభూతి పొందలేరు. అంతేకాక సెక్స్‌ సమయంలో వివి«ధ సమస్యలు కూడా వెంటాడుతాయట. సెక్స్‌లో రోజూ పాల్గొంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా.. సెక్స్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా? ఫలన వ్యక్తి సెక్స్‌ చేస్తూ గుండెపోటుతో మరణించాడని ఇలా వివిధ రకాలు అనుమానాలు వస్తుంటాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన అందిరినీ అనుమానాల్లోకి నెట్టేసింది.

మహారాష్ట్రలోని నాగేపుర్‌లో ఓ (28) తన ప్రియురాలి సెక్స్‌ చేస్తుండగా అకస్మాతుగా ప్రాణాలో కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగానే మృతి చెందాడని తెలిసింది. అయితే సదరు వ్యక్తి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని గుర్తించారు. ఈ ఘటన తర్వాత చాలా మందికి గుండెపోటుకు సెక్స్‌లో సంబంధం ఉందా అనే ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. సెక్స్‌ చేసే సమయంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన గుండె ఉన్నవాళ్లు కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మెట్లు ఎక్కగలుగుతుంటే, ఒక మైలు దూరం జాగింగ్‌ లేదా వాకింగ్‌ చేయగలుగుతున్నారంటే సెక్స్‌లో పాల్గొనడంతో ఎలాంటి ప్రమాదం లేదని ఢిల్లీలోని రిజెన్సీ ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అభినిత్‌ గుప్తా వెల్లడించారు.

శృంగారం అనేది ఓ సహజ ప్రక్రియ. ఒక రకమైన వ్యాయామం. ఆరోగ్యకరమైన గుండె ఉన్న వారెవరికీ సెక్స్‌ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండదని తేల్చి చెప్పారు. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉండి. ఔషధాలు వాడేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంగస్తంభన లోపం వంటి సమస్యలకు మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. గుండె, శృంగార సమస్యలకు సంబంధించిన ఔషధాలను కలిపి తీసుకుంటే చాలా ప్రమాదమట.

వారంలో ఒకసారి శృంగారంలో పాల్గొనే ప్రతి 10 వేల మందిలో ఇద్దరు లేక ముగ్గురికి మాత్రమే గుండెపోటు వచ్చే అవకాశముంటుందని స్పష్టం చేశారు. సెక్స్‌తో గుండె ఆరోగ్యం మరింత మెరుగు పడేవందుకు ఆస్కారం ఉంటుంది. వారంలో కనీసం రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులు, లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉందని చెప్పే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువని సెక్సాలజిస్టులు చెబుతునాన్రు. సెక్స్‌ ఒక రకమైన వ్యాయామం. గుండెను దృఢంగా కూడా చేస్తోంది. రక్తపోటు, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు కూడా సహకరిస్తోందని
సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -