Miryalaguda: గుండెపోటుతో యువతి మరణం.. ఫోన్ చూసి షాకైన కుటుంబ సభ్యులు!

Miryalaguda: చిన్నప్పటినుంచి చదువులో ముందంజలో ఉంటూ బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నటువంటి ఓ యువతి గుండెపోటుతో మరణించి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే మరణించిన ఆ యువతి ఫోన్ నెంబర్ తన చెల్లి పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారిగా తన ఫోన్ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.

మిర్యాలగూడ బాపూజీనగర్‌కు చెందిన గోన శ్రీనివాసరావు, యాదమ్మలకు ఇద్దరు కుమార్తెలు.. వారిలో పెద్దమ్మాయి ప్రవళిక. మంచి చదువు చదువుకుని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది తనకు మంచి సాలరీ రావడంతో బ్యాంకులో దాచుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పారు. అయితే ప్రవల్లికతన మేనమామ ఇంటికి వెళ్ళగా అక్కడ ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు.

 

ఈ విధంగా ప్రవల్లిక మరణించిన 40 రోజులకు తన చెల్లెలు తన ఫోన్ పరిశీలించింది అయితే అందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తమ కాలనీకి చెందిన పందిరి మహేష్ తో తీసుకున్న ఫోటోలు.. అతనికి పంపించిన డబ్బు వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక బ్యాంకు నుంచి 50 వేలు లోన్ తీసుకొని ఈఎంఐ కడుతున్నట్టు కూడా అందులో వివరాలు ఉన్నాయి.

 

ఇలా బ్యాంకులో డబ్బు దాచిపెట్టుకుంటుంది అని తన కుటుంబ సభ్యులు భావించగా ఆమె మాత్రం సంపాదించినది మొత్తం మహేష్ అనే వ్యక్తికి పంపిస్తుందని తెలియడంతో మహేష్ అనే వ్యక్తి తన అక్కని దారుణంగా మోసం చేశారు అంటూ ప్రవల్లిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దీంతో ప్రవల్లిక చనిపోయిన 45 రోజుల తర్వాత ఫిర్యాదు మేరకు ఆమె శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -