Alla Ramakrishna Reddy: మూడేళ్లుగా రూ.4కే రోజుకు 500 మందికి భోజనం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి నిజంగా గ్రేట్ అంటూ?

Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో కేవలం 4 రూపాయలకే దాదాపు ప్రతిరోజు 500 మందికి భోజనం అందించారు. అలా దాదాపుగా మూడేళ్ల పాటు ఈ విధంగా నాలుగు రూపాయలకే మంచి భోజనాన్ని అందించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రజలు ఓట్లు వేసి అతను గెలవడంతో క్యాంటీన్ ని క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయం గురించి కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీద అడిగేసారు ఒక యాంకర్. పాల రామకృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనకు క్యాంటీన్ కి సంబంధించిన ప్రశ్న ఎదురవడంతో ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూ యాంకర్ రామకృష్ణారెడ్డిని ప్రశ్నిస్తూ.. మీరు ఎందుకు క్యాంటీన్ మూసివేశారు? ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం ఆ విధంగా కేవలం నాలుగు రూపాయలకే మంచి మంచి భోజనాన్ని అందించి, ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇప్పుడు ఎందుకులే గెలిచాము కదా అవసరం తీరిపోయింది కదా అన్న ఉద్దేశంతో మీరు ఆ క్యాంటీన్ ని క్లోజ్ చేశారా అని అడిగారు. ఆ విషయంపై రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. చాలా మంచి ప్రశ్న అడిగారు జనాలలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. మీరు అనుకుంటున్నాట్లుగా ఎన్నికల ముందు ఓట్ల కోసం అయితే, ప్రజలను మభ్య పెట్టడం కోసం అయితే చంద్రబాబు గారి లాగా అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత పింఛన్ల రూ. 2000 ఇవ్వడం ఆ తర్వాత పసుపు కుంకుమ ఇలాంటి పథకాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టడానికి ముందు నుంచి అనగా 5 నెలలు ఆరు నెలలు ముందు నుంచి నేను కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

 

అదే ఓట్ల కోసం అయితే ఒక నెల లేక రెండు నెలల ముందు లేదంటే జనవరి నుంచో నేను కూరగాయల పంపిణీ పెట్టుకునేవాడిని. కానీ నా ఉద్దేశం ఓట్ల కోసం అలా చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న క్యాంటీన్లను పెంచుకుంటూ పోతారు అన్న ఉద్దేశంతోనే ఆ క్యాంటీన్ లను ఆపి వేశాను అని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మరిన్ని విషయాలను వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -