MLA Bikshaya Goud: మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్‌లోకి చేరికలు.. ఆ మాజీ మంత్రికి షాక్ తప్పదా?

MLA Bikshaya Goud:  మునుగోడు ఉపఎన్నిక వేళ పార్టీలన్నీ చేరికల పర్వానికి తెరలేపాయి. వీలైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. బలమైన నేతలకు మరింత డిమాండ్ ఏర్పడింది. బలమైన నేతలకు పార్టీలన్నీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉపఎన్నిక వేళ పార్టీలలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. పార్టీలన్నీ నేతలను చేర్చకునేందుకు రెడ్ కార్పెట్ వేశాయి. డోర్లు తెలిసిపెట్టి ఎవరైనా చేరవచ్చని ఆఫర్లు ఇస్తున్నాయి.

ఇప్పటికే టీఆర్ఎస్ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను బీజేపీతో తమ పార్టీలో చేర్చుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన రాత్రికి రాత్రి బీజేపీ కేంద్ర పెద్దలను కలిసి బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీ చేరికలకు విరుడుగా టీఆర్ఎస్ కూడా చేరికలపర్వానికి తెరతీసింది. ఇతర పార్టీల్లోని నేతలను భారీగా చేర్చుకుంటోంది. ఇటీవల కాంగ్రెస్ నేత పల్లెరవికుర్ దంపతులను టీఆర్ఎస్ చేర్చుకుంది. పల్లెరవికుమార్ తో పాటు ఆయన భార్య కల్యాణి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్ లో చేరారు. ఇక తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడి భిక్షమయ్య కూడా టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమయ్యారు.

గురువారం బీజేపీలోకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన రెండు పేజీల లేఖ రాశారు. బీజేపీలో బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. తమ పార్టీ నేతలను చేర్చుకున్న సమయంలోనే బీజేపీకి షాకిచ్చేలా టీఆర్ఎస్ చేరకికలను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా ీసీ సామాజికవర్గానికి చెందిన బిక్షయ్యగౌడ్ ను తమ పార్టీలో చేర్చుకుంటోంది. అయితే ఆయన టీఆర్ఎస్ లోచేరితో ఆలూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలే అవకాశాలున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ కోసం ఇప్పటికే టీార్ఎస్ లో చాలామంది ప్రయత్నాలు చేస్తోన్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా టీఆర్ఎస్ టికెట్ అడుగుతున్నారు. ఇప్పుడు బిక్షయ్యగౌడ్ ఆ నియోజకవర్గం నుంచి గతంలో గెలవడంతో టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రికి షాక్ తగిలే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా ఉననారు. గత ఎన్నికల్లో గొంగిడి సునీత తర్వాత భిక్షమయ్య గౌడ్ రెండో స్ధానంలో, మోత్కుపల్లి నర్సింహులు నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పుడు వీరందరూ ఒకే పార్టీలో ఉంటే టీఆర్ఎస్ లో వర్గ పోరు మొదలయ్యే అవకావముంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం భారీ పోటీ ఉండే అవకాశముంటుంది.

దీంతో బిక్షయ్యగౌడ్ పార్టీలో చేరితే మోత్కకుల్లి నర్సింహులు ప్రాధాన్యత తక్కుతుందని అంటున్నారు. బిక్షయ్యగౌడ్ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014,18 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఓడిపోయారు. 2019లో టీఆర్ఎస్ చేరిన ఆయన.. అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడంతో ఏప్రిల్ 5న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -