Sourav Ganguly: అందుకే పదవి వదులుకుంటున్న.. గంగూలీ

Sourav Ganguly: భారత క్రికెట్‌ మాజీ కేప్టన్‌ సౌరవ్‌ గంగూలీ ఎట్టకేలకు నోరు విప్పాడు. నాలుగేళ్ల క్రితం బీసీసీఐ బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. మరోసారి ఆ బాధ్యతలు కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నాడని.. గంగూలీని రెండవ సారి పదవి ఉంచడం కొందరు క్రికెట్‌ పెద్దలకు ఇష్టం లేదని భిన్న విభిన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల తూటాలకు కారణమైంది. బీజేపీలో చేరేందుకు గంగూలీ నిరాకరించడం వల్లే అతడిని రెండోసారి పదవి చేపట్టేందుకు అనర్హుడిగా మారాడని టీఎంసీ దుమ్మెత్తి పోస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి కొనసాగడానికి ఉన్న అర్హత గంగూలీకి లేదా.. అని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో సౌరవ్‌ నోరు విప్పాడు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీసీసీఐతో తన బంధానికి ముగింపు పడనున్నట్లు ఇన్‌ డైరెక్ట్‌గా సిగ్నల్‌ ఇచ్చాడు. క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (సీఏబీ)కు ఐదేళ్లు, బీసీసీఐ అధ్యక్షుడిగా ఇన్నాళ్లు పనిచేసిన తర్వాత వదిలి వెళ్లిపోవాల్సిందేనని అన్నాడు. ఓ నిర్వాహకుడిగా చాలా సహకారం అందించాలని, జట్టును మెరుగుపరిచాలని అన్నాడు. నిరంతరం ఆడడం సాధ్యం కాదని.. అలాగే బాధ్యతుల కూడా నిరంతరం తీసుకోలేమని స్పష్టం చేశాడు. క్రీడా జీవితంలోని పదిహేనేళ్లు మాత్రం నిస్సంకోచంగా చాలా గొప్పవని గంగూలీ చెప్పుకొచ్చాడు.

గంగూలీ 2015లో పాలనాపరమైన కెరియర్‌లో అడుగుపెట్టాడు. ‘క్యాబ్‌’కు అధ్యక్షుడయ్యాడు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే కరోనా కారణంగా క్రికెట్‌పై తీరని ప్రభావం చూపించింది. సవాళ్లను అధిగమిస్తూనే 2020, 2021లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ యూఏఈలో నిర్వహించగా ఈసారి తిరిగి దానిని భారత్‌కు తీసుకురావడంతో గంగూలీ తీవ్రంగా శ్రమించాడు. అయితే, గంగూలీ హయాంలోనే విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పు కోవడం వివాదాస్పదమైంది. గతేడాది అక్టోబరులో జరిగిన టీ–20 ప్రపంచకప్‌కు ముందు గంగూలీ టీ–æ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -