Kohli: ఈ సారి పక్క కప్పు మనదే.. గంగూలీ కామెంట్‌ వైరల్‌!

Kohli: ఒకప్పుడు సచిన్‌ మైదానంలోకి దిగాడంటే అభిమానుల అరుపులు.. తన టీంకు పరుగులు లభించేవి. చిన్న వయస్సులనే భారత్‌ తరఫున మైదానంలోకి వచ్చిన కోహ్లీని చూసి కూడా కేరింతలు, పరుగులు వచ్చేవి. కోహ్లీ సారథ్యంలో తమ జట్టు ఓడిపోతున్న సమయంలో ఒంటిచేత్తో గట్టెక్కించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత క్రికెట్‌కు విరామం తెలిపిన కోహ్లీ ఆసీయాకప్‌–22తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

గత కొంతకాలంగా కోహ్లీ పరుగులు చేసేందుకు నానా తంటాలుపడుతూ వచ్చాడు. ఒక్క ఓవర్లో దాదాపుగా రెండు బౌండరీలు దాటించే కోహ్లీ కనీసం మూడు పరుగులు తీసేందుకు సతమతమయ్యాడు. అయితే ఈ ఏడాది మాత్రం అతడి ఆట పరిస్థితి మరింత దిగజారీంది.కోహ్లీ ఆట తీరును గమనించిన మాజీ ఆటగాళ్లు అతడిని టీంలో నుంచి బయటకు తొలగించాలనే డిమాండ్‌తో ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ దాదా సౌరవ్‌ గంగూలీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని.. గతంలో అతడు చేసిన పరుగులు, కెప్టన్సీ అతని నిదర్శనమన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌–22లో కోహ్లీ పుంజుకుని పూర్వ వైభవం సాధిస్తాడని ఇటీవల ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో దాదా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

మైదానంలో దిగిన కోహ్లీ సెంచరీలు చేయకపోయిన తన జట్టు గెలుపునకు కావాల్సిన పరుగులు మాత్రం కచ్చితంగా అందిస్తాడని గంగూలీ కోహ్లీని సపోర్టు చేస్తూ వచ్చాడు. అయితే టీం ఇండియా ఇతర ఆటగాళ్లు ఎదుర్కుంటున్న పరిస్థితులను కోహ్లీ సైతం ఎదుర్కుంటున్నాడని ఈ క్రమంలో కోహ్లీకి ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం కల్పిస్తే అతడు గతంలో చేసిన పరుగులు, ప్రతిభను బయటకు తీసే అవకాశం ఉంటుందని గంగూలీని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో భారత్‌–పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఉన్న హైప్‌ను తగ్గించేందుకు ప్రయత్నించాడు. అన్ని మ్యాచులను సాధారణ మ్యాచుల్లాగా వీక్షించాలన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -