Gautam Sawang: చెప్పు విసరడం భావ ప్రకటన స్వేచ్చ.. గౌతమ్ సవాంగ్ కామెంట్స్ జగన్ కు అర్థమవుతాయా?

Gautam Sawang: అధికారంలో ఉన్న పార్టీకి అధికారులకు కొమ్ము కాస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా సహజంగా జరిగేదే. అధికారులంతా కాస్తో కూస్తో అధికార పార్టీ నేతలకు త్వరగా రెస్పాండ్ అవుతారు. కానీ.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరు చాలా దారుణంగా తయారైంది. అధికార పార్టీ నేతల సిట్ అంటే సిట్ అని.. స్టాండ్ అంటే స్టాండ్ అనేలా మారారు. సమస్య ఏంటీ? బాధితులకు న్యాయం జరుగుతుందా? లేదా? అనే దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు? ఏదైనా అంశంలో అధికార పార్టీ నేతల అండ ఎవరికి ఉంటే.. వారికి అనుకూలమైన వైఖరిని అధికారులు తీసుకుంటారు. అంతేకాదు.. వైసీపీ నేతల కంటే ఎక్కువగా అధికారులే రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే.. పలు సార్లు అధికారుల తీరు వివాదాస్పదం అయింది.

కోర్టులు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాలకు రంగులు, అమరావతి రైతుల దీక్షల విషయంలో ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు హాజరై తల దించుకునే పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. అందుకే, అధికార పార్టీ నేతలా? అధికారులా అని కోర్టు ప్రశ్నించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. గతంలో రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ చాలా సార్లు అధికార పార్టీ చేసిన తప్పులకు.. హైకోర్టులో దోషిలా న్యాయమూర్తి ఎదుట నిలబడాల్సి వచ్చింది. రాష్ట్రంలో గంజాయి పండిస్తూ దొరికిన సందర్భాల్లో కూడా ఆయన ప్రభుత్వాన్ని వెనకేసుకొని వచ్చారు.

మరోవైపు అధికారుల అండతో వైసీపీ నేతలు, కార్యకర్తల రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని అరచాలకు సృష్టించాలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో టీడీపీ నేత బోండా ఉమా, బద్ధా వెంకన్నపై జరిగిన దాడి ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ప్రాణాల అరచేత పట్టుకొని పరుగులు పెట్టారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్నంత వరకూ వారు ప్రాణాలతో బతుకుతామని కూడా అనుకోలేదు. టీడీపీ జాతీయా కార్యాలయాన్ని ద్వంసం చేసి, టీడీపీ నేత పట్టాభిపై దాడి చేసిన ఘటన కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఇక.. 8 నెలల క్రితం పుంగనూరులు చంద్రబాబుపై జరిగిన దాడి.. అక్కడ జరిగిన విధ్వంసం కూడా పోలీసుల అండ చూసి వైసీపీ కార్యకర్తలు చేసినవే.

అమరావతిలో నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిపివేసి.. భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయడంతో చంద్రబాబు అక్కడ పర్యటించారు. అప్పుడు కూడా చంద్రబాబుపై కర్రలు, చెప్పులు విసిరారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. అన్ని ఘటనల్లో కూడా తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. అంతేకాదు.. అమరావతిలో చంద్రబాబుపై కర్రలు, చెప్పులు విసిరిన ఘటనపై అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాట్లాడారు. నాయకులుపై దాడి చేయడం వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడమే. ఇప్పుడు జగన్ పై జరిగిన దాడిని కూడా భావప్రకటన స్వేచ్చగానే చూస్తారా? అధికారులు అలాగే చెబుతారా? జగన్ పై చెప్పు విసరడం ఆ వ్యక్తికి యొక్క నిరసన తెలిపే హక్కు అని వదిలేస్తారా?

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -