Getup Srinu-Roja: రోజాపై ఫైర్ అయిన గెటప్ శ్రీను.. ఆ పోస్ట్ లో ఏమన్నారంటే?

Getup Srinu-Roja: బుల్లితెరపై జబర్దస్త్ షో రారాజుగా వెలుగుతోంది. ఆ షో నుంచి చాలా మంది బయటకు వచ్చేశారు. అందులో జబర్దస్త్ కమెడియన్ శీను కూడా ఉన్నారు. గెటప్ శీను అంటే గుర్తుపట్టని వారంటూ ఎవ్వరూ ఉండరు. జబర్దస్త్ షోలో రకరకాల గెటప్ లు వేసి మంచి పాపులారిటీని శీను సంపాదించారు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శీను ఇప్పుడు హీరోగా కూడా మారి సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్లు జబర్దస్త్ కు దూరమైనా మళ్లీ షోలో ప్రత్యక్షమై స్కిట్లు చేస్తున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు జబర్దస్త్ కంటిన్యూ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను గెటప్ శీను ఏర్పాటు చేసుకున్నాడు.

 

అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి, తన లేటెస్ట్ అప్డేట్స్ గురించి గెటప్ శీను పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ అయిన రోజాపై గెటప్ శీను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా గెటప్ శ్రీను రోజాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సైలెంట్ గా ఆమెను గౌరవిస్తూనే ఆమెను ఎక్కడ గుచ్చాలో అక్కడు గుచ్చేశాడని తెలుస్తోంది.

 

గెటప్ శీను మెగాస్టార్ అభిమాని అని అందరికీ తెలుసు. ఆ విషయాని చాలా సార్లు అందరికీ తెలియజేశాడు. తాజాగా రోజా మెగా హీరోల పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు గెటప్ శీను కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా ద్వారా గెటప్ శీను మాట్లాడుతూ.. చిరంజీవి సేవా గుణం, దాన గుణం అందరికీ తెలుసని, ఆయన జీవితం అందరికీ ఎంతగానో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

 

మెగాస్టార్ లో అది మీకు కనపడలేదా రోజాగారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి అంటూ గెటప్ శీను విరుచుకుపడ్డాడు. మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేయడం తప్పని, దానివల్ల ప్రజల్లో గౌరవాన్ని కోల్పోకండని. మీ నోటి నుంచి అబద్దాలు వినాల్సి వస్తుందని అనుకోలేదని గెటప్ శీను తెలిపాడు. దయచేసి రోజా వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోవాలని గెటప్ శీను తన ఫేస్ బుక్‌ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -