Jagan: జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గోనె ప్రకాష్ రావు.. ఏమన్నారంటే?

Jagan: వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతున్న నేపథ్యంలో భారమైన హృదయంతో బహిరంగ లేఖ రాస్తున్నానని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్ కుటుంబంతో నాకు 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పైన జరుగుతున్న విష ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాను.

 

కొన్ని వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురాదల్చానని, ఆ ప్రచారంలో మీ హస్తం ఉందనుటంలో సందేహం లేదని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, మీకు అత్యంత సన్నిహితులు ఆమెపై వేస్తున్న నిరాధారమైన ఆరోపణలు విష ప్రచారంతోపాటు వాటికి మీ కనుసైలలో నడిచే వివిధ మీడియా సంస్థలతోపాటు మీ సొంత మీడియా సాక్షి పత్రిక సాక్షి టీవీలో తాటికాయ తక్షరాలతో వస్తున్న వార్తలే అందుకు నిదర్శనం అన్నారు.

పదవి కోసం, ఆస్తుల కోసం, మీ స్వార్థం కోసం సొంత చెల్లెలిపై ఇంత దారుణానికి ఒడిగడతారని నేను కలలో కూడా ఊహించలేదు. శ్రీమతి షర్మిలపై మీరు చేయిస్తున్న విషపు ప్రచారంతో స్వర్గంలోని దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. దివంగత నేత పేరు చెప్పుకొని మీరు అధికారం, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. అటువంటిది మీరు దివంగత నేతకు నిజమైన వారసులైతే ఆయన ఆత్మకు క్షోభించే విధంగా ప్రవర్తించరు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జైలులో ఉన్నప్పుడు శ్రీమతి షర్మిల, మీ తల్లిగారు శ్రీమతి విజయమ్మ గారు నిద్రాహారాలు మాని మీకోసం, మీరు స్థాపించిన పార్టీ కోసం 24 గంటలు కష్టపడి రక్షించుకున్నారు.

 

అదేవిధంగా మీ సమీప బంధువు, మీ తరఫున అనేక విషయాలను చక్కబెట్టిన శ్రీ సునీల్ శెట్టిని మీరు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడిన గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్టు చేస్తున్నప్పుడు వారు ఎవరో మీకు తెలియదని మీడియా సాక్షిగా ప్రకటించి మీ పిరికితనాన్ని బయట పెట్టుకున్నారు అంటూ గోనె ప్రకాష్ రావు రాసిన బహిరంగ లేక ఇప్పుడు వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -