Gone Prakash: వైరల్ అవుతున్న గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు!

Gone Prakash: తాజాగా గోనె ప్రకాష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం భారతి కోసం తన తల్లి విజయమ్మ షర్మిలను జగన్ దూరంగా పెట్టినట్లు ప్రకాష్ ఆరోపించారు. తాను జైలుకు వెళ్లినా కూడా తన భార్య భారతిని సీఎం చేయాలి అన్నది జగన్ మాస్టర్ ప్లాన్ అని ఆయన వెల్లడించారు. అనంతరం షర్మిల గురించి స్పందిస్తూ షర్మిల పోలీసులను కొట్టారని, ఆ వీడియోని తాను కూడా చూశానని, తను ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడం సరికాదు. షర్మిలా తన కూతురు లెక్క తాను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడను అని తెలిపారు గోనె ప్రకాష్.

షర్మిల అలా రోడ్డు ఎక్కడానికి కారణం జగన్ అనడంలో ఎటువంటి సందేహం లేదని? అలా షర్మిల రోడ్డు ఎక్కడానికి కారణం జగనే కదా అని ఆయన ప్రశ్నించారు? ఏపీ ని వదిలి తెలంగాణకు వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆయన నిలదీశారు. జగన్ చిత్రహింసలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిళను కలిశారని ఆమెకు సహాయం కింద రూ. 5 కోట్లు ఇస్తామన్నారని ప్రకాష్ ఆరోపించారు. ఆ ఎంపీ షర్మిళ వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని స్వయంగా సీఎం జగన్ ఆయనకు ఫోన్ చేసి, ఎందుకెళ్లావ్? సహాయం చేయాల్సిన అవసరం ఏముందని బెదిరించారని ఆరోపించారు గోనె ప్రకాష్. షర్మిళ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

జగన్ ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిళపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. షర్మిళ ఇక్కడ పార్టీ పెడితే జగన్ పరిస్థితి ఏమవుతుంది? అన్నారు. షర్మిళ తన కూతురు లెక్కే కానీ, జగన్ కొడుకు లెక్క కాదని, వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని విమర్శించారు గోనె ప్రకాష్. తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని పొగిడితే జగన్ కు నచ్చదని, విజయమ్మ కంట నీరు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ క్యాబినెట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు గోనె ప్రకాష్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -