NTR: ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ కామెంట్స్ వింటే గూస్ బంప్స్ రావాల్సిందే!

NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ అవార్డుల మీద అవార్డులు అందుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు చేరుకోవడంతో అక్కడున్న అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

 

ఎన్టీఆర్ అభిమానులను చూసి సంతోష పడుతూ కాసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడుతూ.. మీరు చూపిస్తున్న అభిమానానికి పదాలు ఇంకా కనిపెట్టలేదు. అయితే మనసులో ఒక మాట ఏంటంటే.. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించ‌లేక‌పోతున్నాను. మ‌న మ‌ధ్య ఏ ర‌క్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు ద‌గ్గ‌ర‌య్యానో నాకు తెలియ‌టం లేదు.. మీరంద‌రూ నా సోద‌రుల కంటే ఎక్కువ.. మ‌న‌ది ర‌క్త సంబంధం కంటే గొప్ప‌దైన బంధం.. మీకు శిర‌స్సు వంచి పాదాభివందనం చేస్తున్నాన‌నే మాట‌ను చెప్ప‌గ‌ల‌ను.

మీ ప్రేమ‌కు నేను రుణ ప‌డిపోయాను. ఇంకో జ‌న్మంటూ ఉంటే ఈ అభిమానం కోస‌మే పుట్టాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా మొన్నటి వరకు సోదరుడు చనిపోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకొని అవార్డుల ఫంక్షన్ లో పాల్గొని కాస్త సంతోషంగా కనిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -