Gorantla Madhav: రాజకీయ చావులు – పదవులు.. ఏపీలోని అధికార పార్టీ సిద్ధాంతాలు ఇవేనా?

Gorantla Madhav: తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో బస్సు యాత్రకు వైసీపీ నేతలు స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామజిక వర్గాల వారీగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆయా వర్గాల ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలకు ప్రజల మద్దతు కోరాలి అంటూ వైసీపీ అధిష్టానం పార్టీ నేతలకు, మంత్రులకు, ఇంఛార్జ్ లకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో వైసీపీ నేతలు ఈ విధంగా బస్సు యాత్రను చేపట్టారు. అయితే యాత్రలపేరుతో ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు వేయడం ఎవరు తప్పుపట్టరు.

పార్టీని, పార్టీ అధినేతల నిర్ణయాలను సమర్ధించడం కూడా ఆయా పార్టీ నేతల బాధ్యతగానే భావించాలి. కానీ పార్టీ అధినేతను ప్రశంసించడానికో లేదా వారి ప్రాపకం కోసమో పక్క పార్టీల నేతలను కించపరచడం మాత్రం కచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అయితే సామజిక సాధికారత అంటూ ప్రజల ముందుకొచ్చి ప్రతిపక్ష నేత చావుల మీద రాజకీయ చేయడం మాత్రం వైసీపీ నేతల ఆలోచనలు ఏ స్థాయికి పడిపోయాయి మరోసారి నిరూపించారు. 2024 ఎన్నికలలో మరోసారి జగన్ సీఎం కావవడం, చంద్రబాబు చావడం ఖాయం అంటూ వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి వరకు న్యూడ్ వీడియోలతో ఫేమస్ అయినా సదరు ఎంపీ గారు ఇప్పుడు తన పేరు ఎక్కడ వినపడడం లేదు తన వీడియోలు ఎక్కడ కనపడడం లేదు అనుకున్నారో ఏమో కానీ ఎదో ఒక సంచలనమైన విమర్శ చేస్తే మళ్ళీ న్యూస్ లో నిలబడతాను అని భావించారో ఏమో, ఏకంగా చంద్రబాబు చావు దాకా వెళ్లిపోయారు. తండ్రి చావును అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి పదవికై సంతకాలు సేకరించి వైస్సార్ సమాధుల పై వైసీపీ పార్టీ పునాదులు వేసిన అధినేత జగన్ ను ఆదర్శంగా తీసుకున్న ఆ పార్టీ నేతలకు చావులు తప్ప మరో ఆలోచన ఏముంటుంది అంటున్నారు తెలుగు దేశం నేతలు.

వైసీపీ పార్టీ రాజకీయాలు మొదలుపెటింది చావుల పైనే, రాజకీయ చావులు, పదవులు అనేదే ఆ పార్టీ సిద్ధాతం అంటూ టీడీపీ శ్రేణులు తమ విమర్శలతో వైసీపీ పార్టీ పునాదుల వరకు వెళ్లిపోయారు. జైల్లో తన భద్రత పై అనుమానాలు ఉన్నాయంటూ ఇప్పటికే చంద్రబాబు, అతని కుటుంబసభ్యులు పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు పదేపదే చంద్రబాబు చావు పై విమర్శలు చేయడం ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పై అనేక అనుమానాలకు అవకాశమిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యం పట్ల గోప్యత పాటిస్తుందంటూ టీడీపీ నేతలు,కుటుంబసభ్యులు బాబు ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -