Gudivada Amarnath: మంత్రినా.. మోడలా.. వివాదాస్పదంగా ఫొటోషూట్

సినీ తారలకు ఫొటోల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ల అవకాశాల కోసం రకరకాల ఫొటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు. ఫొటోషూట్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టకుంటూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు అయితే బికినీలతో, స్లీవ్ లెస్ డ్రెస్ లతో ఫొటోషూట్లతో రెచ్చిపోతూ ఉంటారు. ఇక ఇటీవల హీరోలు కూడా న్యూడ్ ఫొటోషూట్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఇక సినిమా హీరోయిన్లు, హీరోలే కాదు.. రాజకీయ నాయకులు కూడా ఫొటోషూట్లతో రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు తమ పర్యటలను కవర్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కెమెరామెన్ ను పెట్టుకుంటారు. ఈ కెమెరామెన్లు రాజకీయ నాయకుల ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి మైలేజ్ ను పెంచడానికి ప్రయత్నించారు. ఇంతవరకు ఒకే కానీ.. ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు, మంత్రి ఏకంగా హీరోల తరహాలో ఏకంగా ఫొటోసూట్ నే ఏర్పాటు చేసుకున్నాడు.

ఏపీ ఐటీ, పరిశ్రామికమంత్రి గుడివాడ అమర్ నాధ్ తాజాగా ఓ ఫొట్ షూట్ లో పాల్గొన్నారు. కారులో నిల్చోని, కారు ఎక్కుతూ స్ట్రైలిష్ కళ్లజోడు పెట్టుకుని ఫొట్ షూట్ చేయించుకున్నారు. సినిమా హీరోలా ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నేత, మంత్రి అయి ఉండి ఇలా హీరోలలాగా ఫొటోషూట్లు చేయించుకోవడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ప్రతిపక్ష టీడీపీ నేతలు మంత్రి అమర్ నాథ్ షొటోషూట్ పై మండిపడుతున్నారు. మంత్రి అయి ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయిన ఫొటోషూట్లు చేయించుకోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా మంత్రి ఫొటోషూట్ పై లోలోపల గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -