Gudivada Amarnath Vs Vangalapudi Anitha: మహిళా నేతను కొడతానని చెప్పిన వైసీపీ మంత్రి.. ఏపీలో పరిస్థితులు అదుపు తప్పాయా?

Gudivada Amarnath Vs Vangalapudi Anitha: రాజకీయ నాయకులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ఇలా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు ప్రజాసేవ చేయాలి కానీ ప్రస్తుతం రాజకీయాలకే అర్థం మార్చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు అంటే అధికారపక్షంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాన్ని దూషించడం ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించడం ఇదే ప్రస్తుతం రాజకీయమైంది.

తమ పార్టీ స్వలాభం కోసం రాజకీయ నాయకులు ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి మరి ఒకరినొకరు దూషించుకుంటున్నారు.దీన్ని బట్టి చూస్తుంటే అసలు రాజకీయమంటే ఏంటి అన్న వాదన అందరిలోనూ కలుగుతుంది. ఇక అధికారపక్షంలో ఉన్నటువంటి నాయకులు పూర్తిగా రాజకీయాలను మరిచిపోయి ప్రతిపక్ష నేతలను దారుణమైనటువంటి వ్యాఖ్యలతో కించపరుస్తూ మాట్లాడుతున్నారు.

అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిత పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన సతీమణి భారతమ్మ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే పరిగెత్తిచ్చి కొడతా అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి మహిళ నేతను పరిగెత్తించి కొడతాను అని మాట్లాడటం ఏంటి? అసలు ఈ ప్రజాస్వామ్యం ఏమైంది ఏపీ పోలీస్ శాఖ ఏం చేస్తోంది ఏపీ మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి. అధికారంలో ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఓ మహిళను ఈ విధంగా మాట్లాడటం కరెక్టేనా అంటూ ప్రజలు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గురించి అలా మాట్లాడితే పరిగెత్తి ఇచ్చి కొడతాం అని కామెంట్లు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు సతీమణి గురించి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి బహిరంగ సభలలో ప్రస్తావిస్తున్నారు. మరి వారిని ఏమనాలి అంటూ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -