Gudivada Amarnath: పాములు పట్టేవాడు ఆ పాము కాటుకే.. బాబు గురించి గుడివాడ సెటైర్లు మామూలుగా లేవుగా!

Gudivada Amarnath: రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై, అలాగే లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశారని లోకేష్ విమర్శించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. చంద్రబాబు కి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని లోకేష్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్ కి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకంగా 13 ఫైల్స్ లో సంతకాలు చేశారు.

తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సిఐడి అధికారాలతో సహా వెలికి తీసింది. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారు, అసెంబ్లీలో స్క్రీన్ పై ప్రదర్శించే ప్రజలకు స్పష్టంగా వివరించాము. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి అంటూ లోకేష్ ని ప్రశ్నించారు అమర్నాథ్. పాములు పట్టే వాడికి తనకి పాములు వల్ల ఎలాంటి భయం ఉండదు అనుకుంటాడు కానీ అదే పాము కాటుకి బలి అయిపోతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అనే పేరు ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వ్యవస్థలకు చిక్కి జైలు పాలయ్యాడు అంటూ తీవ్రంగా స్పందించారు అమర్నాథ్.

అలాగే నిబంధనలకు విరుద్ధంగా 370 కోట్లు చెల్లించాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం వాస్తవం కాదా, ఆ విధంగా చెల్లించిన నిధులు షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరటం సిఐడి దర్యాప్తులో వెల్లడి కావటం నిజం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ అసలు ఎందుకు నోటీసులు జారీ చేసిందో సమాధానం చెప్పగలరా అంటూ సవాలు విసిరారు.

40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే మీ బాబు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అడ్డదారుల సీఎం పదవి దక్కించుకున్నాడు. తెదేపాని, ఆ పార్టీ గుర్తు,ని ట్రస్ట్ ని కూడా కొట్టేశాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమర్నాథ్.మరి తెలుగు తమ్ముళ్లు ఎలాంటి స్పందన ఇస్తారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -