Gudivada Amarnath:పెందుర్తి నుంచి పోటీ చేయనున్న గుడివాడ అమర్నాథ్….!

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక డైలాగ్ తో మొత్తం ఫేమస్ అయిపోయారు… రాష్ట్రం గుడ్డు పెట్టిందని అది ఇంకా పొదగలేదని తెలంగాణతో పోల్చుకుంటే ఎలాగని డైలాగు వేయగా నెటిజన్లందరూ కోడి గుడ్డు మంత్రి అంటూ పిలవడం మొదలుపెట్టారు. అయితే నిత్యం జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కౌంటర్లు వేయడం తప్ప ఐటీ మంత్రిగా అమర్నాథ్ చేసింది ఏమిటంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు.

 

అయితే తాజాగా ఎన్నికల నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి సీటు లేదని విషయం స్పష్టమైనది. మలసాల భరత్ కుమార్ ని అనకాపల్లి ఇంచార్జిగా చేసింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయం అయింది. మరి గుడివాడ అమరానాధ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. తనకు అనకాపల్లి సీటు కేటాయించకపోవడంతో ఇటీవల జరిగిన ఒక సభలో గుడివాడ అమర్నాథ్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ పోటీ చేస్తారు అని ఒక చర్చ సాగింది. కానీ ఇపుడు సామాజిక సమీకరణల నేపధ్యంలో గవర సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తారు అని అంటున్నారు.

చోడవరం నుంచి గుడివాడ పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి కానీ చోడవరంలో కరణం ధర్మశ్రీ బలంగా ఉన్నారు. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. అందువల్ల మరోసారి ఆయనే పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక మిగిలింది పెందుర్తి సీటు. పెందుర్తి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన పనితీరు మీద సర్వే నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. పైగా భూ ఆరోపణలు కూడా ఎమ్మెల్యే అనుచరుల మీద ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన నేత పంచకర్ల రమేష్ బాబును ఇక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారు అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -