Pemmasani Chandrasekhar: పెమ్మసాని జోరుతో వైసీపీకి చుక్కలే.. వైసీపీని గద్దె దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కాస్త కూస్తో గ్రాఫ్ ఉండేది అయితే ఎన్నికల పర్యటనలో భాగంగా ఆ గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కానీ ఆ బస్సు యాత్రకు కాస్తా తుస్సు యాత్రకు మారిపోయింది. బస్సు యాత్రకు జనాలను తరలించడానికి వైసిపి నేతలు నానా కష్టాలు పడుతున్నారు.

ఇలా అన్ని నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతు పెరుగుతూ వస్తుంది కానీ వైసీపీకి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఇలా వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో కొంతమంది వైసీపీ నేతలు పోటీలో లేకపోవడమే మంచిదని భావించగా మరికొందరు పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటి నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థుల సైతం వెనుకడుగు వేయడానికి సిద్ధమయ్యారు.

తెలుగుదేశం పార్టీకి కంచు కోటుగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంట్ నుంచి ప్రతిసారి గల్లా జయదేవ్ పోటీకి దిగేవారు. అయితే ఈయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఈ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్ర‌శేఖ‌ర్ గ‌త కొన్నేళ్లుగా గుంటూరు పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి తలలో నాలుకల ఉండిపోయారు.

ఇక ఇప్పుడు ఈయన పోటీకి దిగారని తెలిసి ఎంతో మంది వైసీపీ నాయకులు కూడా పెమ్మిసానికి మద్దతు నిలిచారు. దీంతో అక్కడ వైసిపి నుంచి పోటీ చేస్తున్నటువంటి కిలారి కోశయ్య ఓటమిని అంగీకరించారని కూడా తెలుస్తోంది. కిలారి కోశయ్యకు ప్రత్యర్థిగా పెమ్మసాని బరిలోకి దిగడంతో అక్కడ వైసిపి మరింత బలహీనపడింది..తద్వారా ఆయన కూడా ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం కంటే ఎన్నికల నుంచి తప్పుకోడం మంచిదని భావించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలు జరగకుండానే గెలుపు టిడిపి సొంతమవుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -