Hanuman Movie Review: చిన్న సినిమాల్లో పెద్ద హిట్.. తేజ సజ్జాకు తిరుగులేదుగా!

Hanuman Movie Review

విడుదల తేదీ: 12 జనవరి 2024

నటీనటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ , గెటప్ శీను, వెన్నెల కిషోర్, సముద్రఖని తదితరులు
నిర్మాత: కే నిరంజన్ రెడ్డి
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
సంగీతం: హరి గౌర , అనుదీప్ దేవ్ ,కృష్ణ సౌరభ్
ఫోటోగ్రఫీ: శివేంద్ర దాశరథి

 

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం హనుమాన్ బాల నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయినటువంటి తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి హనుమాన్ సినిమా నేడు పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంది అనే విషయానికి వస్తే..

 

కథ: అంజనాద్రి అనే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు హనుమంతు (తేజ సజ్జ). అతడికి అమృత (అమృత అయ్యర్) అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. తమ ఊరిని గుప్పట్లో పెట్టుకొని కొంతమంది జమీందారులు ఊరిని పాలిస్తూ ఉంటారు అయితే వారికి అమృత ఎదురు తిరగడంతో బందిపోట్లను పంపి ఆమెను చంపాలని చూస్తారు. వాళ్ళ నుండి కాపాడే ప్రయత్నంలో చావు బతుకుల మధ్య సముద్రంలో పడిపోతాడు హనుమంతు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన హనుమంతకు అతీతమైనటువంటి శక్తులు వచ్చాయి ఆయనకు ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అంజనాద్రి కోసం హనుమంతు ఎలా పోరాటం చేశారు అన్నది ఈ సినిమా కథ.

నటీనటుల నటన: తేజ సజ్జా నటుడిగా ఈ సినిమాతో మరో పది మెట్లు పైకి ఎదిగాడనే చెప్పాలి. ఇక హనుమంతుడు తనలో వచ్చిన తర్వాత ఈయన నటన మరో లెవల్ కి చేరిపోయిందని చెప్పాలి. ఇక ఈయనతో పాటు ఇతర చిత్ర బృందం కూడ ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

 

విశ్లేషణ: ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సబ్జెక్ట్ చేసుకున్నటువంటి హనుమాన్ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.ఇక ఈ సినిమా డైరెక్షన్ విషయంలో దర్శకుడు తన నైపుణ్యం మొత్తం బయటపెట్టారు. తక్కువ బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ చూపించారు. కథానుసారం వచ్చే ట్విస్టులు బాగున్నాయి.సంక్రాంతికి ఫ్యామిలీతో సహా మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. సినిమా మొదటి 20 నిమిషాలు కాస్త బోర్ అనిపించిన చివరి 20 నిమిషాలు వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి పండగ పూట ఒక మంచి సినిమా చూసాం అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది.

 

ప్లస్ పాయింట్స్: తేజ సజ్జా నటన బీజీఎం, విజువల్ ఎఫెక్ట్స్, కథ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

మైనస్ పాయింట్: అక్కడక్కడ కాస్త బోరింగ్ సన్నివేశాలు కథ నిదానంగా సాగడం.

రేటింగ్: 3.25/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -