Hanuman: బుక్ మై షోలో హనుమాన్ రికార్డ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hanuman: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా, ఎవరి నూట విన్నా హనుమాన్ సినిమా పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ సినిమా హవానే ఎక్కువగా నడుస్తోంది. సినిమా విడుదలకు ముందు చిన్నచూపు చూసిన వారితో సైతం ఔరా అనిపించుకునేలా చేసింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా అనిపించింది.

 

అంతేకాకుండా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఎక్కడ హనుమాన్ ఆడుతున్న ఆ థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుంద‌ని, వీఎఫ్ఎక్స్, విజువల్స్​ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే తాకగా ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం విడుదలకు ముందే ఇండియా వైడ్​గా మంచి హైప్​ను అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ పేరు సోషల్ మీడియాలో, పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -