Hardik Pandya: విమర్శకులకు పాండ్యా కౌంటర్.. కుక్కలతో పోలుస్తూ పంచ్

Hardik Pandya: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యంపై టీమిండియా ఆటగాళ్లను కొందరు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీమిండియా మాత్రం తదుపరి మ్యాచ్‌లతో బిజీగా మారిపోయింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. దీంతో తమపై వస్తున్న విమర్శలకు హార్దిక్ పాండ్యా తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు.

 

 

టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించకుండానే వెనుతిరగడంపై జట్టులో నిరాశ ఉందని.. కానీ తామంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లమని హార్దిక్ పాండ్యా అన్నాడు. విజయాలను ఎలా ఆస్వాదిస్తామో వైఫల్యాన్ని అలాగే జీర్ణించుకోవాలని జట్టులోని సహచరులకు సూచించాడు. అయితే లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. మళ్లీ టీ20 ప్రపంచకప్ జరిగేందుకు రెండేళ్ల సమయం ఉందని.. ఆలోగా కొత్త ప్రతిభావంతులను వెలికితీస్తామని తెలిపాడు.

 

2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇప్పుడే మొదలైందని హార్దిక్ పాండ్యా వివరించాడు. అయితే తమకు చాలా సమయం ఉందని.. ఏం చేయాలన్నదానిపై జట్టులోని ఇతర సభ్యులతో కూర్చుని మాట్లాడతామని తెలిపాడు. ఇప్పుడైతే తమ లక్ష్యం ఆటను ఆస్వాదించడమేనని.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం తమకు ఉందని చెప్పాడు.

 

కుర్రాళ్లకు మంచి అవకాశం
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులోని యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని హార్దిక్ పాండ్యా అన్నాడు. తన వరకు ప్రతి సిరీస్ ముఖ్యమైనదేనని.. ఏ సిరీస్ కూడా తేలిగ్గా తీసిపారేయడానికి లేదన్నాడు. అయితే ప్రపంచకప్‌తో పోలిస్తే ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడటం వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌‌లో కుర్రాళ్లు రాణిస్తే వాళ్లు మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అటు తమపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్‌కు చురకలు అంటించాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -