Rohit Sharma: గాయమైనా పోరాటం ఆపని రోహిత్ శర్మ.. మ్యాచ్ ఓడినా మనసులు గెలిచిన టీమిండియా సారథి

Rohit Sharma: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ రెండో వన్డేలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే గాయపడ్డాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రోహిత్ చేతికి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలి గాయానికి కట్టు కట్టుకున్న రోహిత్.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ కు రాలేదు. భారత ఇన్నింగ్స్ లో కూడా అతడు బ్యాటింగ్ కు వచ్చే అవకాశం లేకపోవడంతో టీం మేనేజ్మెంట్ శిఖర్ ధావన్ తో పాటు విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా పంపింది.

అయితే తొలి వన్డే మాదిరిగానే ఈ మ్యాచ్ లో కూడా భారత్ టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శిఖర్ ధావన్ (8), కోహ్లీ (5), కెఎల్ రాహుల్ (14) లు దారుణంగా విఫలయమ్యారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన వాషింగ్టన్ సుందర్ (14) కూడా ఆడలేదు. కానీ శ్రేయాస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56) లు పోరాడారు. ఐదో వికెట్ కు 102 పరుగులు జోడించారు. కానీ వరుసగా అయ్యర్, అక్షర్, శార్దూల్ ఠాకూర్ (7) నిష్క్రమించడం తో టీమిండియా 42.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

అప్పుడొచ్చాడు..

చేతి వేలికి గాయమైనా హిట్ మ్యాన్ ఆ గాయాన్ని సైతం లెక్క చేయలేదు. మ్యాచ్ కోల్పోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా క్రీజులోకి వచ్చాడు. వేలి గాయం ఇబ్బంది పెడుతున్నా పోరాడాడు. అండగా ఉంటాడనుకున్న దీపక్ చాహర్ (11), సిరాజ్ (2) లు విఫలమైనా బెదరలేదు. చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగుల చేయాల్సిన క్రమంలో.. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఎబాదత్ వేసిన 46వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. మహ్మదుల్లా వేసిన 49వ ఓవర్లో 6, 6 బాదాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ముస్తాఫిజుర్ వేసిన యార్కర్ కు పరుగులేమీ రాలేదు.

ఈ మ్యాచ్ లో చివరి బంతికి ఆరు పరుగులు చేయకపోవడంతో భారత్ ఓటమి పాలైనా గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆడిన రోహిత్ శర్మ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. అసలు ఆశలే లేని స్థితి నుంచి భారత్ ను విజయం ముంగిటకు తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-0తో సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -