Mrunal Thakur: సీతారామం బ్యూటీ పారితోషికం ఈ రేంజ్ లో పెరిగిందా?

Mrunal Thakur: తెలుగు వెండితెరపై సీతమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ఈమె పలికించిన హావభావాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తదుపరి సినిమా అవకాశాన్ని అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాను ఎంపిక చేసుకుందని చెప్పాలి. ఇలా సీతారామం హిట్ అయిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగైదు సినిమాలకు కమిట్ అయి ప్రస్తుతం వరుస సూటింగులతో బిజీగా ఉన్నటువంటి మృణాల్ నాచురల్ స్టార్ నానితో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

కాస్త ఆలస్యంగానే ఈమె తెలుగులో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ సరైన సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్థమవుతుంది.అయితే తెలుగులో మొదటి సినిమాకు సుమారు 60 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి ఈమె తన తదుపరి చిత్రానికి మాత్రం భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారు. ఒకేసారి ఈమె రెమ్యూనరేషన్ కోట్లలో పెరిగిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

నానితో సినిమా చేయడం కోసం మృణాల్ ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. 60 లక్షల నుంచి ఏకంగా మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచడం అంటే మామూలు విషయం కాదు అయినప్పటికీ నిర్మాతలు ఈమె అడిగినది చెల్లించి తనని సినిమాలలో తీసుకుంటున్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇక నానితోనే కాకుండా ఇతర టాలీవుడ్ హీరోలతో కూడా సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈమె ఏకంగా ముంబై వదిలి హైదరాబాదులోనే స్థిరపడాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -