Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏం జరిగిందంటే?

Manchu Lakshmi: మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురుగా, ఒక నటిగా మనందరికీ తెలుసు. ఈమె పెద్దగా సినిమాలలో రాణించకపోయినా, ఈమె మాటలు ద్వారా చేతల ద్వారా ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె మాట్లాడే తెలుగును అందరూ ట్రోలింగ్ కి గురి చేస్తారు.

 

ఒక కామెడీ పీస్ ని చూసినట్లు చూస్తారు. ఇది ఆమెలోని ఉన్న ఒక కోణం మాత్రమే మరో కోణం కూడా చూపించి తన మంచి మనసుని చాటుకుంది మంచు లక్ష్మి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది మంచు లక్ష్మి.

గత కొన్ని ఏళ్లు గా టీచ్ ఫర్ చేంజ్ పేరిట అవకాశాన్ని సంస్థలు నిర్వహిస్తుంది మంచు లక్ష్మి. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకి వెళ్తుంది ఈ సంస్థ. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో దత్తత తీసుకున్న పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు.

 

ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నది తమ అభిమతం అని చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. ఇప్పటికే ఏపీలో వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్నారు అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లతో పాటు ఇతరత్రా వసతులను కూడా సమకూర్చారు.

 

వాటిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలాగా చూస్తున్నారు ఇప్పుడు అదే ధైర్యంతో జోగులాంబ జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకోవటానికి ముందుకు వచ్చామని తన ధీమా వ్యక్తం చేశారు మంచు లక్ష్మి. ఇందుకుగాను ఆ జిల్లా కలెక్టర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. నిజంగా మంచి లక్ష్మి మంచితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -