Corona: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Corona: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా చాలా చాలా మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. అయితే ఇలా గుండెపోటు కారణంగా మరణిస్తున్న వారిలో చిన్న వయసు వారే మరణిస్తుండడం గమనార్హం. అయితే అంతసేపు నవ్వుతూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఊహించని విధంగా ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. గుండెపోటు మరణాలు పెరగడంతో కరోనా వ్యాక్సిన్‌ కారణంగానే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. మరి నిజంగానే కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

 

ఇదే విషయంపై వైద్యులు స్పందిస్తూ..యువతలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వీళ్లల్లో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. వయసు పైబడిన వారిలో రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి వారికి నెమ్మదిగా క్లోజ్‌ అయి నిదానంగా నొప్పి రావడం జరుగుతుంది. కానీ గుండెపోటుకు గురవుతున్న యువతలో గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సడెన్‌గా బ్లాక్‌ అవ్వడం వల్ల వారు కుప్ప కూలుతున్నారు. అయితే అలా గుండెపోటుకు గురైన వారికీ మూడు నిమిషాల్లో కనుక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వగలిగితే వారిని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ధూమపానం చేయడం, డ్రగ్స్‌ వినియోగం, ఆహార అలవాట్లు ముఖ్యమైనవి కూడా గుండెపోటుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అలానే కోవిడ్‌ తర్వాత, వ్యాక్సిన్‌ తీసుకున్న మూడు నెలల్లోపే ఏవైనా సమస్యలు వస్తాయి. కోవిడ్‌ బారిన పడితే ఆరు వారాల వరకే దాని ప్రభావం ఉంటుంది.

కోవిడ్‌కున్న మరో ప్రధానమైన లక్షణం ఏంటంటే క్లాట్స్‌ ఏర్పడతాయి. గుండె, బ్రెయిన్‌లో క్లాట్స్‌ ఏర్పడి హార్ట్‌ ఎటాక్‌, పెరాలసిస్‌ వంటి సమస్యల తలెత్తుతాయి. మూడు నెలల వరకే ఈ ప్రభావం ఉంటుంది. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఎకోస్ప్రిన్‌ ట్యాబ్లెట్‌ తీసుకుంటే ఆ సమస్యను కూడా గుర్తించవచ్చు. చాలా మంది కోవిడ్‌ తర్వాత మూడు నెలలు ఈ టాబ్లెట్స్‌ వాడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా తగ్గి సుమారు ఆరు నెలలు అవుతోంది. ఇప్పుడు దాని ప్రభావం వల్ల గుండె పోటు వస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పుకొచ్చారు వైద్యులు. అలాగే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వస్తుంది అన్నమాట సరైనది కాదు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 6 వారాల వరకే దాని ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్‌ వల్ల ఇలా జరుగుతుంది అనే దానికి లాజికల్‌గా, సైంటిఫికల్‌గా ఎలాంటి నిర్ధారణ లేదు. వ్యాక్సిన్‌ వల్ల ఇలాంటి సమస్యలు రావు అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -