Bunny: ఆయనను నమ్మి బన్నీ నిండా మునగనున్నాడా.. ఏమైందంటే?

Bunny: టాలీవుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు పెరిగిపోయాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది కానీ ఈయన పాత సినిమా నుంచి కథను కాపీ కొడతారనే భావన అందరిలోనూ ఉంది.

 

పాన్ ఇండియా స్థాయిలో మెప్పించాలి అంటే డైలాగ్స్ మాత్రం సరిపోవని ఎప్పుడైతే నార్త్ ఇండియన్స్ ప్రేక్షకుల నాడి పట్టుకుంటారో అప్పుడే సినిమా సక్సెస్ అవుతుందని కొందరు ఈ కాంబినేషన్లో సినిమాపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉంది అదేవిధంగా తన సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.

 

ఇకపోతే త్రివిక్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు మెచ్చుకునేలా అల్లు అర్జున్ తో సినిమా చేస్తారా అన్న సందేహాలు మాత్రం ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కొందరు బన్నీ అభిమానులు అసలు బన్నీ ఎందుకు త్రివిక్రమ్ తో సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రకటించారు. ఈయనను నమ్ముకునీ బన్నీ ఇబ్బందులలో పడబోతున్నారా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -