Sharmila: షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనుక ఆ వ్యక్తి ఉన్నారా?

Sharmila: తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటుతానని చెప్పిన షర్మిల వైఎస్సార్టీపీ ద్వారా ఎంతో కష్టపడినా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెచ్చి తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంలో వెనక్కు తగ్గారు. తెలంగాణ కాంగ్రెస్ విజయం సాధించడానికి కొంతమేర షర్మిల కూడా కారణమయ్యారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.

 

ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తానని షర్మిల బలంగా నమ్ముతున్నారు. వైసీపీ, టీడీపీలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కావాలని షర్మిల భావిస్తుండటం గమనార్హం. అయితే షర్మిల అనుకున్నవి అనుకున్న విధంగా జరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక వైఎస్సార్ ఆత్మ కేవీపీ ఉన్నారని తెలుస్తోంది.

షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనుక తెర వెనుక ఉన్న వ్యక్తి ఆయనేనని ఆయన సూచనల మేరకు ఆమె పార్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ కు అత్యంత సన్నిహితులలో కేవీపీ ఒకరు కాగా జగన్ మాత్రం కేవీపీని దూరం పెట్టారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న కేవీపీ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలను తీసుకోవడం గురించి పాజిటివ్ గా స్పందించారు.

 

కాంగ్రెస్ పార్టీకి షర్మిల ద్వారా పూర్వ వైభవం వస్తుందని కేవీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పలు సందర్భాల్లో జగన్ సర్కార్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేవీపీ సైతం రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీకి కొన్ని సీట్లు వచ్చినా ఆమె ఏపీ రాజకీయాల్లో మలుపులు తిప్పే అవకాశాలు అయితే ఉన్నాయి.

 

షర్మిల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వైఎస్ జగన్ కు ఓటమి తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నారు. షర్మిల పావు అయ్యారని వైసీపీ ప్రచారం చేస్తుండగా షర్మిల పావులు కదపబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్నతో యుద్ధం చేసేందుకు షర్మిల సిద్ధమైన నేపథ్యంలో జగన్ సొంత చెల్లిపై విమర్శలు చేస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వైఎస్ షర్మిలకు వైఎస్ విజయమ్మ సపోర్ట్ దక్కితే మాత్రం షర్మిలకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల జగన్ పై విమర్శలు చేస్తే మాత్రం మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సీఎం సీటే లక్ష్యంగా షర్మిల రాజకీయాలను మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చినా షర్మిల లక్ష్యాన్ని సాధించినట్టేనని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -