Cloves: వాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే లవంగాలు తినాలట!

మనం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల మందులు, ఆయూర్వేద పద్ధతులను వాడుతుంటాం. కొందరు చిన్న చిన్న చిట్కాలతో వంటింట్లో వాడే దినుసులైన మిరియాలు, చిలకర్ర, మెంతులు, లవగాలు, ఇలైచీ లాంటి వాటిని ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎలాంటి వంటల్లోనైనా ఘుమఘుమలు రావాలంటే సుగంధద్రవ్యాలు కచ్చితంగా వాడుతారు. అలాంటి సుగంధద్రవ్యాల్లో ఒకటైన లవంగాలను మాంసాహార వంటకాల్లో తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసన, రుచినీ అందించే లవంగాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయి.

ఈ లవంగాలను నిత్యం వండే కూరల్లో వేస్తే మలబద్ధకం తొలగిపోయి జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గ పనిచేస్తోంది. జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వాంతులు, కడుపుబ్బరం, గ్యాస్, ఛాతీభాగంలో నొప్పి, వికారం వంటి సమస్యలతో బాధ పడేవారు ఈ లవంగాలను పెనంపై కాసేపు వేడి చేసి ఆ తర్వాత పొడిచేసుకుని తేనెలో కలిపి తీసుకుంటే ఈ సమస్యలు దూరమవుతాయని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.

మధుమేహంతో బాధపడేవారు కూడా లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదంట. మధుమేహంతో బాధపడే వారు వీటిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడంతో ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలోని మహిళలకు ఇవి చాలా ఎంతో చేస్తాయి. అంతేకాక లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొదిస్తుండటంతో పాటు ఇన్ఫెక్షన్లు రాకుండా వాటిని దూరం చేస్తాయి.

లవంగాలు తినడంతో కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు మటుమాయం అవుతాయి. దాంతో పాటు కాలేయ సంబంధిత సమస్యలనూ కంట్రోల్‌ చేస్తాయి లవంగాలు. కాలేయంలోని వ్యర్థాలను వెను వెంటనే బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్థాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడీ, రాతి ఉప్పూ వేసి తాగితే కొద్ది సేపట్లోనే తలనొప్పి తగ్గిపోతోంది. అందుకే మనం ఉద్యోగాలు, పనులకు వెళ్లినప్పుడు లవంగాలను మన వెంట తీసుకుని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని నములుతు ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -