Mushrooms: బరువు తగ్గాలంటే ఇవి తినాలంట నిజమా?

Mushrooms: గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతాలం చేసిన కరోనా మహమ్మారి కారణంతో మనిషి ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏవి తినకూడదని నిర్ధారించుకుని వాటిని అనుసరిస్తున్నాడు. గతంలో పెద్దలు పుట్టగొడుగులు తినాలంటే వామ్మో అనే వారు.. కానీ.. ఇప్పుడు వాటిని ఇష్టంగా లాగిస్తున్నారు. ఎందుకంటే అవి తింటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి.

ఆరోగ్యానికి దివ్య ఔషధంగా చెప్పుకునే పుట్టగొడుగులను వివిధ రకాలుగా వంటల్లో వినియోగిస్తారు. మాంస, శాఖహారంలో వేసి వండితో ఆ రుచేవేరు. పుట్టగొడుగుల్లో ప్రొటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, పైటోకెమికల్స్, విటమిన్లు సీ,బీ,డీ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పుట్టగొడుగులు తినడంతో వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లును రాకుండా చేస్తాయి. వాటిలో 92 శాతం నీరు, ఎక్కువ మొత్తంలో పోషకాలు, తక్కువ క్యాలరీలను ఉండటంతో శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. పుట్టగొడుగులలో ఉండే పాలిశాకరైడ్స్‌ మన శరీరం అధిక బరువును తగ్గించడానికి తోడ్పడుతోంది. వీటిని తినడంతో ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన
కలుగుతుంది.

ప్రయోజనాలు ఇవి..

1.పుట్టగొడుగులలో ఉండే ఐరన్‌.. అనీమియా ఉన్న పేషెంట్లలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది.

2.పుట్టగొడుగులు తినడంతో కాపర్, పొటాషియం అంది వెంట్రుకల సాంద్రతను పెంచి వెంట్రుకలు దృఢంగా ఉంచుతాయి.

3.మలబద్ధకం, గ్యాస్, ఎíసీడిటీ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో పాటు జీర్ణశక్తి బలపడుతుంది.

4.బీపీని కంట్రోల్లో ఉంచడంలో పుట్టగొడుగులు బాగా ఉపయోగపడుతాయి.

5.కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు దరి చేరవు.

6. పుట్టగొడుగులను తింటే శరీరంలో పేరుకుపోయే కొవ్వులను కరిగిస్తుంది. కొవ్వు కరిగిపోవడంతో శరీర బరువు అమాంతంగా తగ్గిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -