Hero Nikhil: రూ. 1116 నుంచి 100 కోట్లు నిఖిల్ సినీ ప్రస్థానం ఇదే?

Hero Nikhil సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్న, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న టాలెంట్ చాలా అవసరం. అయితే కొంతమంది నటీ నటులు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవదానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కో డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న హీరో నిఖిల్ ప్రస్తుతం యువహీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా రూ. 1116 మొదటి పారితోషికం అందుకున్న నిఖిల్ చాలా కాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాలో నటుడిగా అవకాశం పొందాడు. హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ నటించిన పాత్ర వల్ల మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హీరోగా మారి యువత, స్వామి రారా, కార్తికేయ, అర్జున్ సురవరం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మరొకసారి భారతీయ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు.

ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న సంకల్పంతో మంచి వైవిధ్యమైన కథలను ఎన్నుకొని సినిమాలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. కార్తికేయ 2 సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా ఇటీవల ఒక ఈవెంట్ ని కూడా నిర్వహించారు. కార్తికేయ 2 సినిమా విడుదల కాకముందు కేవలం టాలివుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన నిఖిల్ ఈ సినిమా విడుదలయిన తర్వాత బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు హీరోగా ఒక మంచి స్థాయిలో ఉన్న నిఖిల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -