Asia Cup 2022: భారత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి హాంకాంగ్‌ టీం ఎందుకొచ్చిందో తెలుసా?

Asia Cup 2022: క్రికెట్‌ అంటే ఇష్టముండని వారు ఉండరు. ఆట మొదలైందంటే టీవీలు, ఫోన్‌లకు అతుక్కుపోతుంటారు. ప్రతీ క్రీడల్లో ఎంత ప్రత్యేర్థులు, దాయదులు ఉన్నా మ్యాన్‌ అయిపోయిన తర్వాత అందరు సరదగా ఉంటారు. అప్పుడప్పుడు గ్రౌండ్‌లో ఇరు దేశాల ఆటగాళ్లు ఇతర ఆటగాళ్లను ఆట పట్టిస్తుంరు. ఇతర దేశ క్రీడాకారులను అక్కున చేర్చుకోవడం వారితో సరదాగా గడపడం మన క్రికెటర్లు ఎక్కువగా చేస్తుంటారు.

బుధవారం జరిగిన హాంకాంగ్‌ జట్టుపై భారత్‌ విజయసాంకేంతం ఎగరవేసి సూపర్‌ ఫోర్‌కు దూసుకెళ్లింది. మ్యాన్‌ పూర్తయిన తర్వాత ఇరు జట్ట ఆటగాళ్లు వారి వారి పెవిలియన్‌కు చేరుకున్నారు. కాసేపటి తర్వాత హాంకాంగ్‌ ఫిల్డర్లంతా ఒక్కసారిగా ఇండియా డెస్సింగ్‌ రూమ్‌కు వచ్చి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, జడేజాలతో మీట్‌ అయ్యారు. రోహిత్‌ శర్మ తన జెర్సీపై సంతకం చేసి హాంకాంగ్‌ కెప్టెన్‌కు ఇవ్వగా సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌పై ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు.

వీరిద్దరు ఇలా చేయగా విరాట్‌ కోహ్లీ మాత్రం ఏకంగా హాంకాంగ్‌ ప్లేయర్‌ జెర్సీపైనే సంతకం పెట్టేశాడు. ఈ సన్నివేశంతో టీం ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ సందడిగా మారింది. ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు ముచ్చటించుకున్నారు. అయితే.. ఆటకు ముందే హాంకాంగ్‌ ఫిల్డర్లు టీమిండియా ఆటగాళ్లపై తన అభిమానం వెల్లడించారు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్లు హాంకాంగ్‌ కెప్టెన్‌ ఆకాంక్షించాడు.

టీమిండియా లాంటి ఛాంపియన్‌ జట్టుపై ఓడిన కూడా హాంకాంగ్‌ బౌలింగ్, బ్యాటింగ్‌లో ప్రతిభ కనబరిచింది.బౌలింగ్‌ సమయంలో మొదటి 15 ఓవర్ల వరకు టీమిండియా పరుగులను కట్టడి చేసింది. అలాగే ఇండియా బలమైన బౌలింగ్‌ లైనప్‌ను ఎదుర్కొని 5 వికెట్లు కోల్పోయి 152 మంచి స్కోరును చేసింది. ఆసియా కప్‌ క్వాలిఫైయర్స్‌ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి హాంకాంగ్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఆడటంతో పాటు మంచి ప్రదర్శన కనబర్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -