Eggs: రోజూ అంతకు మించి గుడ్లు తింటే ప్రమాదమట.. అసలు విషయం ఇది!

Eggs: కోడి గుడ్లలో ఎక్కువ ప్రోటిన్లు ఉండటంతో వాటిని తరచుగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అయితే గుడ్లను కొందరు శాఖహారంగా భావిస్తే మరికొందరు గుడ్లు మాంసహారం అంటుంటారు. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. గుడ్డును ప్రొటీన్ల నిధి అని పిలుస్తారు. అందుకే మాంసాహారం చికెన్‌ తినని వారు కూడా గుడ్లు తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక రోగాలు కూడా వస్తాయి. ఒక రోజులో మనిషి శరీరానికి ఎంత ప్రొటీన్‌ అవసరమో అంతే తీసుకోవాలని హెచ్చరిస్తుంటారు.

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. శరీరంలో వేడి, అశాంతి, జీర్ణక్రియ సరిగా లేకపోవడం, వాంతులు వంటి సమస్యలు ఉండవచ్చు. వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి గుడ్లను తీసుకోవాలి. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వ్యక్తులు, కొలెస్ట్రాల్‌ సంబంధిత సమస్యలు లేని వారు రోజుకు 2 గుడ్లు తినవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఉన్న వ్యక్తులు గుండె సమస్యలు ఉన్న వ్యక్తులు పిల్లలు, టీనేజర్లు కూడా ప్రతిరోజూ ఒకే గుడ్డు తినాలి 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డు మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

వ్యక్తి శరీరానికి ఒక రోజులో ఎంత ప్రోటీన్‌ అవసరమో, అది వ్యక్తి బరువు ఎంత అనేదాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. శరీర బరువు ప్రకారం.. ప్రతి కిలోగ్రాము బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్‌ అవసరం. ప్రతిరోజూ శరీరానికి ప్రోటీన్‌ అవసరాన్ని అంచనా వేయవచ్చు. అలాగే మీ ఆహారాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇందులో పప్పులు, గుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌ ఉండాలి. తద్వారా శరీరానికి తగిన మోతాదులో ప్రొటీన్లు అందుతాయి. ఒక గుడ్డులో సాధారణంగా 6 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది.

అందువల్ల, రెండు గుడ్లు తినడం ద్వారా కూడా మీ శరీరానికి దాని అవసరానికి అనుగుణంగా పూర్తి ప్రోటీన్‌ లభించదు. కానీ గుడ్లలో కనిపించే కొలెస్ట్రాల్‌ స్థాయి కారణంగా ఎక్కువ గుడ్లు తినరాదని సూచిస్తున్నారు. ఒక గుడ్డులో 187 ఎంజీ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. మన శరీరానికి (ముఖ్యంగా ఆరోగ్యకరమైన పెద్దలకు) ప్రతిరోజూ 300 ఎంజీ కొలెస్ట్రాల్‌ మాత్రమే అవసరం. అందుకే ఒక రోజులో రెండు గుడ్లు కంటే ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్లు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్‌ స్థాయి బాగా పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -