1000 Crores: ఏ మూవీ ఎన్నిరోజుల్లో రూ.1000 కోట్లు సాధించిందో తెలుసా?

1000 Crores: ఒక్కప్పుడు తెలుగు సినిమాలు వంద కోట్ల వసూళ్లు రాబట్టడానికి ఎంతో సమయం పట్టేది. ఒక్కోసారి 100, 200 రోజులు కూడా పట్టేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ మరింతగా అభివృద్ధి అయింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. టెక్నిషియన్లు సంఖ్య, గ్రాఫిక్ డిజైన్‌ల వాడకం మరింతగా పెరిగింది. వందకోట్లు రాబట్టే చోట.. ఇప్పుడు ఈజీగా వెయ్యి కోట్లు వసూలు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన ఇమేజ్‌తో సినీ ఇండస్ట్రీ మరింతగా వ్యాప్తి చెందింది. రాజమౌళిని చూసి ఇన్‌స్పైర్ అయిన చాలా మంది యువ డైరెక్టర్లు కొత్త కొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత మంది డైరెక్టర్లు తీసిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో.. ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేశాయనే విషయాన్ని తెలుసుకుందాం..

 

 

దంగల్..

నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 23 డిసెంబర్ 2016న రిలీజ్ అయింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో విడుదలైన ఈ సినిమాలో ‘అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షైక్, జైరా వాసిమ్, సాన్యా మల్హోత్రా, అప్రశక్తి ఖురానా కీలకపాత్రల్లో నటించారు. కేవలం 27 రోజుల్లోనే వెయ్యి కోట్లు సంపాదించుకుంది.

 

 

ఆర్ఆర్ఆర్/బహుబలి..

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. 24 మార్చి 2022లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం 16 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసింది. అలా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి-2’ సినిమా కేవలం 10 రోజుల్లో మాత్రమే రూ.1000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నటించిన ప్రభాస్ గ్లోబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

 

 

కేజీఎఫ్-2..

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కేజీఎఫ్-2’. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ‘సంజయ్ దత్, రవీనా తండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్’ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదలైంది. కేవలం 16 రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -