Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే ఆ పార్టీదే అధికారమా.. ఏం జరిగిందంటే?

Telangana Assembly Elections:  ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే గంటకు రాజకీయ సమీకరణలు మారిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వరుస ఎదురుదెబ్బలతో కారు పార్టీ పంచర్లతో విలవిల లాడుతుండగా నేతల వలసలతో కాంగ్రెస్ యమా జోష్ అంతకుమించి జోరు మీద ఉంది. బీజేపీ అయితే గతంలో వచ్చిన సీట్లు వచ్చినా చాలు మహాప్రభో అని అనుకుంటోంది. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీల నుంచి నేతలు గుడ్ బై చెప్పేసి హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇక పార్టీ గెలిచేసింది ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్లుగా కాంగ్రెస్ సీన్ క్రియేట్ చేస్తోంది.

దీనికి తోడు పలు సర్వేలు సైతం కాంగ్రెస్‌దే హవా ఆరు నూరైనా అధికారం హస్తందే అని తేల్చిచెబుతున్నాయి. మరికొన్ని సర్వేల్లో అబ్బే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అంటూ క్లియర్‌ కట్‌గా చెప్పేస్తున్నాయి. ఇంకొన్ని సర్వేలు యితే పక్కాగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదు. హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నాయి. ఒకవేళ ఆ సర్వేల ప్రకారం హంగ్ వస్తే పరిస్థితేంటి? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చినప్పటికీ తప్పకుండా అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని తేలిపోయింది. ఒకవేళ అదే జరిగితే సారు కారు పార్టీకి అడ్వాంటేజ్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బీజేపీతో కాంగ్రెస్ కలవదు. అలాగనీ ఎంఐఎంతోనూ అస్సలు అయ్యేపని కాదు. ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్‌ ఎంఐఎం కలిసే ఉన్నాయి కాబట్టి కచ్చితంగా మజ్లిస్ మద్ధతు కారు పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు అలా ఉన్నాయి. ఎలాంటి తోపులు, తురుములు నిల్చున్నా సరే హైదరాబాద్‌లో ఏడు స్థానాలు మజ్లిస్ పార్టీవే.

ఇంకొక స్థానం పెరుగుతుందేమో కానీ తగ్గే ప్రసక్తి అయితే అస్సలు లేదు. 2014, 2018 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే అధికారాన్ని దక్కించుకున్నాయి. ఒకరితో ఒకరు పొత్తు లేదు కానీ సవ్యంగానే ముందుకెళ్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కీలక పదవులు అన్నీ మజ్లిస్ నేతలకు ఇస్తున్నారు కేసీఆర్. ఈసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఎంఐఎం కావాల్సిందల్లా గులాబీ బాస్ కాదనకుండా ఇచ్చేస్తారు. కాబట్టి ఎలాంటి విబేధాలు అక్కర్లేదు. అంతకుమించి కాంగ్రెస్ వైపు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -