Roja: రోజా నగరి నుంచి పోటీ చేస్తే మాత్రం వైసీపీకి భారీ షాక్ తప్పదా?

Roja: వైసీపీ నుంచి రెండుసార్లు నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గెలిచిన రోజాకు ప్రస్తుతం ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. నియోజకవర్గంలోని ఒక్క మండలంలో కూడా ఆమెను అభిమానించే కార్యకర్తలు లేరు. పెద్దిరెడ్డి ఆమెకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో వ్యవహరించిన సంగతి తెలిసిందే. రోజా నోటిదురుసు కూడా ఆమెకు ఎంతో నెగిటివిటీని పెంచింది. ఆమెకు టికెట్ ఇస్తే వైసీపీకే నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రోజాకు నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండగా వైసీపీ వల్లే ఆమెకు అంతోఇంతో పొలిటికల్ గా మంచి గుర్తింపు వచ్చింది. అయితే వచ్చిన గుర్తింపును సరైన విధంగా ఉపయోగించుకోవడంలో రోజా ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ లను విమర్శించే విషయంలో చాలా సందర్భాల్లో రోజా ఒకింత హద్దులు దాటారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. రోజా మాటతీరు ఆమెను అభిమానించే వాళ్లను సైతం దూరం చేసింది,

 

ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేశారని రోజా ఏకంగా రజనీకాంత్ నే విమర్శించారు. వాస్తవానికి నగరి నియోజకవర్గంలో ఆమె గెలుపు వెనుక తమిళం వచ్చి నగరిలో నివశిస్తున్న ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. రజనీపై ఆమె చేసిన కామెంట్ల వల్ల ఈ ఎన్నికల్లో తమిళ ఓటర్లు సైతం ఆమెకు వ్యతిరేకంగా పని చేయాలని ఫీలవుతున్నారు.

 

నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజాకు టికెట్ కు దక్కే అవకాశాలు కూడా చాలా అంటే చాలా తక్కువని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. నగరిలో గత కొన్నేళ్లలో టీడీపీ బలపడిందని టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఇక్కడ తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి దిశగా రోజా అడుగులు వేయకపోవడం వల్ల ఆమెకు ప్రజల మద్దతు లభించలేదు.

 

మంత్రి పదవి కోసం రోజా పడిన కష్టం అంతాఇంతా కాదు. అయితే పదవి వచ్చిన తర్వాత రోజా ఆ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేసిందా అనే ప్రశ్నకు సైతం కాదనే సమాధానం వినిపిస్తోంది. జగన్ దగ్గర రోజాకు మంచి పేరు ఉన్నా ఆ మంచి పేరు 2024 ఎన్నికల్లో ఆమెకు ఉపయోగపడుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో చిత్తూరులోని మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ హవా స్పష్టమని తేలిపోయింది.

 

రోజాకు టికెట్ రాకపోయినా ఆమెకు ఇతర పార్టీలలో చోటు లేదు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్దగా గుర్తింపు లేని పార్టీలు రోజాకు ఛాన్స్ ఇవ్వొచ్చు కానీ టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఆమెకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మాత్రం దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. రోజా అద్భుతమైన పొలిటికల్ కెరీర్ ను చిన్నచిన్న తప్పుల వల్ల చేతులారా నాశనం చేసుకున్నారని ఆమె అభిమానులు చెబుతున్నారు. రోజా రాజకీయాల్లో ఫెయిలైతే సినిమాలు, టీవీ షోలపై దృష్టి పెట్టక తప్పదని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -