Sharmila: ఆ కామెంట్లను జనం నమ్మితే మాత్రం జగన్ కు ఇబ్బందేనా?

Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అందరి ఆసక్తి నెలకొంది ఎలాగైనా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాలన ఉద్దేశంతో అన్ని పార్టీలు పొత్తు కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి పై దాడి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు జగన్ సొంత చెల్లెలు షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె పార్టీ పగ్గాలు చేపట్టిన మరుసటి రోజు నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది.

 

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఈమె చేసే విమర్శలు మామూలుగా లేవని చెప్పాలి ప్రతి జిల్లాలోని సభలను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం.. చేసిన విమ‌ర్శ‌లు ఒక ఎత్త‌యితే.. తాజాగా క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ష‌ర్మిల చేసిన ప్ర‌క‌ట‌న‌ అందరిలోనూ ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. ఇదే కనుక జనాలలోకి వెళ్తే వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులలో పడతారని తెలుస్తోంది.

కడప జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్టే అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇదే నినాదాన్ని తెరపైకి తీసుకోవచ్చారు. ఎన్నికల నెల వరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా తెలిపాయి.

 

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులలో పడింది ఇప్పుడు షర్మిల కూడా అదే నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త జనాలలోకి బలంగా వెళితే మాత్రం వైసీపీకి ఇబ్బంది అవుతుందని పలువురు అభిప్రాయాలను తెలియచేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -