Sharmila: షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా కష్టమా.. ఏం జరిగిందంటే?

Sharmila: వైయస్ షర్మిల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్నటువంటి పేరు వైయస్సార్ కుమార్తెగా గత ఎన్నికలలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఈమె పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే వీరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ షర్మిల మాత్రం తన అన్నయ్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

 

ఏపీలో కాకుండా తెలంగాణలోకి వెళ్లి ఈమె తన తండ్రి పేరు మీదగా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ స్థాపించిన అనంతరం తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకువస్తానని శపదాలు చేసి పాదయాత్ర కూడా చేశారు అలాగే అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తానని చెప్పారు. చివరికి షర్మిల కూడా ఎక్కడ పోటీకి నిలబడకుండా వెళ్ళిపోయారు.

ఇలా ఈమె స్థాపించిన వైయస్సార్టిపి పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈమె ఏపీ కాంగ్రెస్ చీప్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈమె జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ కనిపిస్తున్నారు అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో జగన్ కి పోటీగా నిలబడబోతున్నారని తెలుస్తోంది.

 

పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తన అన్నయ్యకు వ్యతిరేకంగా నిలబడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా కనుక షర్మిల చేస్తే ఆమెకు డిపాజిట్లు కూడా రావు అంటూ పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటినుంచో పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి మారుపేరుగా నిలిచిపోయింది. అలాంటి పులివెందులలో వైయస్ ఇద్దరు బిడ్డలు నిలబడితే వైయస్ ముద్ర ఉన్నవారికి ప్రజలు పట్టం కడతారు కానీ ఇతరులకు కాదు అంటూ గతంలో కూడా ఓసారి నిరూపితమైంది.

 

గత ఎన్నికలలో పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి 90000 మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అంత మెజారిటీ రాకపోయినా షర్మిల పోటీ చేస్తే కాస్త ఓట్లు చీలవచ్చు కానీ గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని షర్మిల పోటీ చేస్తే తనకు డిపాజిట్లు కూడా దక్కవు అంటూ సర్వేలు తెలపడమే కాకుండా పులివెందుల ప్రజలు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికలలోనైనా షర్మిల నిలబడి తన స్టామినా ఏంటో నిరూపించుకుంటుందా లేకపోతే తెలంగాణలో మాదిరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మౌనంగా ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -