Warangal: పైచదువుల కోసం ఇంటిని అమ్మితే మరి పంపించారు.. ఆపై?

Warangal: ప్రస్తుత రోజుల్లో యువత చిన్న చిన్న విషయాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు బోలెడు దుఃఖం ని మిగులుస్తున్నారు. తాజాగా కూడా ఒక యువతి అలాంటి పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌ ప్రాంతానికి చెందిన బసవరాజ్‌ విజయ, రమేష్‌ దంపతుల కూతురు శ్రావణి.

ఉన్నత విద్య నిమిత్తం లండన్‌ వెళ్లింది. కాగా శ్రావణి తండ్రి లారీ డ్రైవర్‌ కాగా తల్లి గృహిణి. అయితే బిడ్డ ఉన్నత చదువుల కోసం సొంత ఇంటిని అమ్మి మరీ విదేశాలకు పంపారు. అయితే తన కోసం తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావించిన శ్రావణి ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. బిడ్డ భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మితే ఇప్పుడు అదే బిడ్డ ప్రాణాలు తీసుకుని తమ ఆశలనే కాక భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చింది అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు శ్రావణి తల్లిండ్రులు.

 

లండన్‌లోని వరంగల్‌ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్‌ నీల, ఫౌండర్‌ కిరణ్‌ పసునూరి, జాయింట్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ బిట్ల, ఉమెన్‌ వింగ్‌ సెక్రెటరీ మేరీఏలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి శ్రావణి మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు తెలిపారు. శ్రావణి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసినట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -