Warangal: అలాంటి వాళ్లకు తగిన శాస్తి చేశారుగా.. అసలేం జరిగిందంటే?

Warangal: తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు సృతిమించిపోతున్నాయి. దాడులు, హత్యలు, కబ్జాలు పెచ్చుమీరిపోయాయి. సామాన్య ప్రజలు వారిని చూసి హడలిపోతున్నారు. భూములు లాక్కోవడంపైతోపాటు పేదలపై అక్రమ కేసులు కూడా అధికార పార్టీ నాయకులు పెడుతున్నారు. దీంతో అనేక చోట్ల ప్రజలు విసిగిపోయాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఘటన అందరికీ షాక్ కు గురించి చేసింది.

 

తెలంగాణలో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హజ్య తండాలో పేదల భూమిని కొట్టేసేందుకు బీఆర్ఎస్ నాయకులు పన్నాగం వేశారు. అధికార దర్పాన్ని ప్రదర్శించి అక్రమణకు వెళ్లారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తమ సాగు భూములను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి అనుచరులు కబ్జా చేయడానికి వచ్చారని భూమి హక్కుదారులైన మహిళలు ఆరోపించారు. భూమి దగ్గరకు వచ్చిన వారిని మహిళా రైతులు చెప్పులతో కొట్టారు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

అధికార పార్టీ నాయకులకు మహిళా రైతులు సరైన బుద్ధి చెప్పారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్లు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు, దోపిడిలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఘటనతో నిజమనే వార్త సుస్పష్టం అయ్యింది. దీనిపై ఎమ్మెల్యే చల్లాని వివరణ కోరగా స్పందించారు.

 

చల్లా అనుచరులుగా భావిస్తున్న సవాయి శ్రీనివాస్‍, ఇతరులపై రైతులు దాడులకు దిగిన వీడియోలు వైరల్‍ కావడంతో ఎమ్మెల్యేతో పాటు గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన బీఆర్‍ఎస్‍ లీడర్లు స్పందించారు. కొమ్మాల ఘటనలో పాల్గొన్న వారితో తనకు గాని, తమ పార్టీకి గాని సంబంధం లేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే తనని బ్లేమ్ చేస్తున్నాయని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ప్రతిపక్ష నాయకులు డైరెక్ట్ గా ఎదుర్కోవాలని చల్లా స్పష్టం చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -