Warangal: కొడుకు చేసిన పాపానికి శిక్ష అనుభవించిన తండ్రి.. ఏమైందంటే?

Warangal: రోజురోజుకీ టూవీలర్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడికి వెళ్లాలి అన్న కూడా చాలామంది బైక్ ని ఉపయోగిస్తున్నారు. కొంచెం దూరం ఉన్నా కూడా చాలామంది బైకులనే ఉపయోగిస్తున్నారు. చాలామంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాటిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బైక్ డ్రైవ్ చేయడం వల్ల వారి ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక యువకుడు కూడా ట్రాఫిక్ నిబంధనలు పట్టించకుండా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి.

మరి చివరికి ఏం జరిగింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. మల్లారెడ్డి పల్లికి చెందిన పాలకుర్తి మొగిళి వరంగల్ లోని ఒక బట్టల దుఖానంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నారు. ప్రతి రోజు మల్లారెడ్డి పల్లె నుంచి వరంగల్ కు వెళ్లి విధులు నిర్వహించుకుని తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేవాడు. ఇతని కుమారుడు సూర్య అదే బైక్ పై నిబంధనలు విరుద్దంగా ప్రయాణించడంతో చలాన్లు విధించారు. ఈ నెల 21వ తేదీన ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వీరి బైక్ పట్టుబడింది.

 

ఆ బండి నెంబర్ పై చలాన్లు పెండింగ్ ఉన్నాయని అవి చెల్లించి బండి తీసుకెల్లాలని పోలీసులు సూచించారు. దీంతో బైక్ లేకపోతే తను విధులకు వెళ్లలేనని పాలకుర్తి మొగిళి మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ లోని ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇదిలా ఉండగా మొగిళి చావుకు ట్రాఫిక్ పోలీసులే కారణమని కుటుంబసభ్యులు, కొడుకు సూర్య ఆరోపిస్తూ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -