Vizag Steel Plant: అమ్మకానికి వైజాగ్ ఉక్కు భూములు.. విశాఖ వాసులకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందిగా!

Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కర్మాగారం సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఒక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపి విశాఖ ముక్కున ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇటు ప్రజలు అటు కార్మికులు ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా విశాఖ భూములను అమ్మకానికి పెట్టడంతో పెద్ద ఎత్తున మరోసారి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

వైసిపి ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఒత్తిడి తేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ముందడుగు వేస్తోంది. ఆపదలో ఉన్నటువంటి ఈ పరిశ్రమకు ప్రత్యేకంగా గనులను కల్పించే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావచ్చు. సెయిల్ విలీనం చేయడం మరో పరిష్కారమైన తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనలు చేయకుండా ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటికే పలు సందర్భాలలో తెరపైకి విశాఖ ఆస్తుల అమ్మకానికి తీసుకువచ్చింది. తాజాగా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత విలువైన భూములను ఫ్లాట్లుగా విభజించి బ్రోచర్లను కూడా విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం రైతుల నుంచి 19670 ఎకరాల భూమిని సేకరించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 1600 కోట్ల వరకు ఉంది. తాజాగా విడుదల చేసినటువంటి బ్రోచర్ల ప్రకారం పెద్ద గంట్యాడలో చదరపు గజం విలువ 20,500 లుగా ఉంది. ఆటోనగర్లో 30 నుంచి 35వేల వరకు ఉంది. హెచ్డి కాలనీలో 74 నుంచి 81 వేల విలువ ఉంది. ఇలా ఈ ఆస్తులను అమ్మకానికి పెట్టడంతో పూర్తిస్థాయిలో ఈ అమ్మకాలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -