AP Sarpanches: జగన్ ను నమ్మితే నిండా మునిగినట్టే.. మీకు అర్థమవుతోందా?

AP Sarpanches: సాధారణంగా ఉద్యోగ సంఘాల నేతలు ఏది డిమాండ్ చేస్తే ప్రభుత్వం వాటికి తల ఉంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి ఎన్నో డిమాండ్లు వ్యక్తం చేశారు. ఇలా గత రెండు మూడు నెలల వరకు ఏపీ ఉద్యోగ సంఘం నేతలు భారీగా హల్చల్ చేస్తూ డిమాండ్లు చేశారు కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఇలా ఎన్నో డిమాండ్లు చేసినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు జగన్మోహన్ రెడ్డి గీసిన గీత మాత్రం దాటడం లేదు.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా లేనిపోని కేసులు మీద వేసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించిన ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు జగన్మోహన్ రెడ్డిని పొగడడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఏది చెబితే అదే.. మీరేమిస్తే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న రీతిలో ఉద్యోగ సంఘం నేతలు ఉన్నారు.ఉద్యోగ సంఘాల నేతలకు భయపడే ప్రభుత్వాలు ఇలా ఉద్యోగ సంఘాల నేతలని తమ దారిలోకి తెచ్చుకున్నాయి అంటే ఇక సర్పంచ్ సంఘాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

 

కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నా వాటిని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోందని, దీంతో గ్రామాలలో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలికవసతులు కల్పించలేకపోతున్నామని సర్పంచులు తమ గోడును అధికారులకు చెప్పిన అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో సర్పంచ్ సంగం నేతలందరూ కలిసి కేంద్ర ఆర్ధిక సంఘం పంచాయతీలకు మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలంటూ నేడు విజయవాడలో పంచాయతీ రాజ్‌ కమీషనర్ కార్యాలయం ముట్టడించారు.

 

ఈ విధంగా సర్పంచ్ సంగం నేతలందరూ కూడా ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో ఈ వ్యవహారంపై పలువురు స్పందిస్తూ కొమ్ములు తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలను తాను గీసిన గీత దాటకుండా నిలబెట్టగలిగిన సిఎం జగన్మోహన్ రెడ్డికి సర్పంచ్ సంఘాల ఆందోళనలు ఓ లెక్కా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతల బాధలను పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ సంఘాల బాధలను లెక్కలోకి తీసుకుంటారా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -