Health: ఈ పదార్థాలు తింటున్నారా? అయితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది..!!

Health: ఆధునిక యుగంలో మనిషి జీవిన విధానం మారింది. మారుతున్న కాలంతోపాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యామాయం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతిఒక్కరికీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలనే విషయం తెలిసి ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందికి చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధుల వల్ల చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వైద్యులు సైతం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరం పెడితే గుండె సంబంధిత వ్యాధులు దూరం పెట్టే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ను కలిగిన పదార్థాలను, ధూమపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో రక్తపోటు రావడం నుంచి మొదలై.. గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది.

ధూమ, మత్తు పదార్థాలకు దూరం..

సిగరెట్, ఆల్కహాల్ వంటి ధూమ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని సేవించడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయానికి ఎక్కువ హాని కలుగుతుంది. దీంతో గుండెకు నేరుగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

కూల్‌డ్రింక్స్ తాగడం..

అధిక మొత్తంలో కూల్‌డ్రింక్స్ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. కూల్‌డ్రింక్స్‌ లను సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

జంక్, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మాంసం..

చాలా మంది స్పైసీ, మసాలా ఫుడ్, జంక్‌ఫుడ్‌లకు ఇష్టపడుతుంటారు. ఆయిల్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువ ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్, జంక్ ఫుడ్‌లను అవాయిడ్ చేయాలి. అలాగే ప్రాసెస్డ్ చేసిన మాంసాన్ని కూడా తినొద్దు. ఈ మాంసంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ చేసిన మాంసాన్ని తింటే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -